బీహార్ మూడో విడత పోలింగ్ కు జోరుగా ప్రచారం

bihar13ఈ నెల 28న జరగనున్న ఎన్నికలు

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం జోరుగా సాగుతోంది. మూడో విడత పోలింగ్ కు… 10 రోజుల సమయం ఉండడంతో… ర్యాలీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు నేతలు. మహా కూటమి తరపున మరోసారి ప్రచారంలోకి దిగారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ఒకే రోజు రెండు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. బుక్సర్, మాంఝీలో ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించారు. ప్రచారంలో మెయిన్ గా బీజేపీని టార్గెట్ చేశారు సోనియా. కావాలనే కొంత మంది మత ఘర్షణలు సృష్టించి… ఎంజాయ్ చేస్తున్నారన్నారు. మోడీపైనా విమర్శలు గుప్పించారు. బీహార్ లో సర్వేలను చూసి.. కొందరు కేంద్ర మంత్రులకు నిద్రపట్టడం లేదన్నారు సోనియా. సోనియా విమర్శలను తిప్పికొట్టారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ ఎన్ని ఆరోపణలు చేసినా… బీహారీలు బీజేపీనే సపోర్ట్ చేస్తారన్నారు. మోడీ అభివృద్ధి నినాదానికి రాష్ట్ర ప్రజల సపోర్ట్ ఉంటుందన్నారు.  మరోవైపు బీహార్ లో ప్రధాని నరేంద్ర మోడీ.. ఎన్నికల సభలు రద్దు కావడానికి రాష్ట్ర నేతలే కారణమన్నారు ఆ పార్టీ నేత శతృఘ్న సిన్హా. బీహార్ బీజేపీ నేతల వైఖరిపై కొంత కాలంగా ఆయన అసంతృప్తితో ఉన్నారు. అంతకు ముందు… ఎన్నికల కోసం నిర్ణయించిన మోడీ సభలను కొన్నింటిని తగ్గించాలని డిసైడైంది బీజేపీ. చివరి నిమిషంలో మోడీ సభలు రద్దు కావడం… నెగిటివ్ సంకేతాలను పంపిస్తుందని ట్వీట్ చేశారాయన. ఇక బీహార్ లో మూడో విడతలో భాగంగా 50 అసెంబ్లీ స్థానాలకు… ఈనెల 28న పోలింగ్ జరగనుంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy