బీహార్ లో తొలి దశ ప్రశాంతం

bihar-polls-first-phase_650x400_61444636741బీహార్ లో తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సెక్యూరిటీ థ్రెట్ ఉన్న ప్రాంతాల్లో కూడా అంతా సవ్యంగానే సాగింది. ఉదయం నుంచి ఓటర్లు నెమ్మదిగానే కదిలినా… గత ఎన్నికల్లో కంటే రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. పలువురు వీఐపీలు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఐదు దశల ఎన్నికల్లో భాగంగా… సోమవారం 10 జిల్లాల్లోని 49 నియోజకవర్గాల్లో జరిగిన మొదటి దశ ఎన్నికల్లో 57శాతం పోలింగ్ నమోదు అయినట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇది 6.15శాతం ఎక్కువగా ఉందని తెలిపింది. 2010 అసెంబ్లీ ఎన్నికల్లో 50.85శాతం ఓటింగ్ నమోదైంది. ఇక ఇవాళ జరిగిన ఓటింగ్ లో మహిళల క్యూ కట్టారు.  59.50శాతం మహిళలు ఓటేయగా… పరుషుల్లో 54.5శాతం మాత్రమే ఓటింగ్ లో పాల్గొన్నారు.

ఓ వైపు పోలింగ్ కంటిన్యూ అవుతుండగానే… ఆర్జేడీ, జేడీయూలపై డైరెక్ట్ అటాక్ కు దిగారు ప్రధానిమోడీ. జెహనాబాద్, భబువాల్లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో మోడీ పాల్గొన్నారు. బీజేపీ అభివృద్ది ఎజెండాగా… ఎన్నికలకు వెళ్తోందన్న మోడీ… ప్రత్యర్థులకు మాత్రం మోడీ వినాశనమే ఎజెండాగా ఉందన్నారు. ఇక భబువాలో మోడీని అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించారు. తనను అడ్డుకుంటే నడిచి వెళ్లైనా ప్రచారం చేస్తానన్నారు.

ఇక సర్వేలు టెన్షన్ పెడుతున్న పరిస్థితుల్లో బీజేపీకి బూస్ట్ నిచ్చే విషయం చెప్పారు సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్. బీహార్ లో బీజేపీ కూటమి గెలుపు తథ్యమన్నారు. ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారన్న ములాయం… బీజేపీ మంచి పనులు చేస్తే సమర్థిస్తానన్నారు. ములాయం కామెంట్స్ బీజేపీ నేతలకు హుషారునిస్తే… మహాకూటమి నేతలకు మాత్రం చికాకు తెప్పిస్తున్నాయి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy