బీహార్ లో వరదలు : 153 మంది మృతి

bihar floodsవరదలు బీహార్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. నేపాల్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా నదుల్లో నీటి ఉద్ధృతి పెరిగింది. దీంతో బీహార్‌ సహా యూపీలో వరదలు సంభవించాయి. బీహార్‌లోని 17 జిల్లాల్లోని రమారమి కోటి మంది ప్రజలు వరదల్లో చిక్కుకపోయారు. ఇప్పటికే 153 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

అరారియాలో 30 మంది, పశ్చిమ్‌ చంపారన్‌ 23, సీతామర్హి 13, మధుబాణి 8, కతిహార్‌ 7, కిసాన్‌గంజ్‌ 11, తూర్పు చంపారన్‌ 11, సుపౌల్‌ 11, పూర్ణియా 9, మాదేపురాలో 9 మంది చొప్పున మరణించారు. దర్భంగాలో నలుగురు, గోపాల్‌గంజ్‌ 4, సహస్ర 4, ఖగారియా 3, షియోహర్‌ 3, సరన్‌ 2, ముజఫర్‌పూర్‌లో ఒకరు వరదల కారణంగా మృతిచెందినట్లు విపత్తు నిర్వహణ విభాగం ప్రత్యేక కార్యదర్శి అనిరుధ్‌ కుమార్‌ తెలిపారు. ఈ వరదల్లో 27 పశువులు చనిపోయాయి.

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే 3,92,654 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ నుంచి 1,152 మంది సిబ్బంది, ఆర్మీ నుంచి 2,228 మంది సిబ్బంది సహాయకచర్యల్లో పాల్గొన్నారు. వరదల్లో చిక్కుకున్న వారందరిని రక్షించడానికి చర్యలు ముమ్మరం చేసింది బీహార్‌ ప్రభుత్వం. 1289 సహాయ, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. వరదల్లో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఇప్పటికే 280 పడవలు పని చేస్తున్నాయి. వాటికి తోడుగా అదనంగా మరో 194 మోటారు పడవలను, 2305 నాటు పడవలను ఏర్పాటు చేసింది బీహార్ ప్రభుత్వం.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy