బీ అలర్ట్: నగరంలో దొంగల ముఠాలు.. పట్టపగలే దోపిడీలు

robberyదొంగలు రెచ్చిపోతున్నారు. రాత్రిళ్లే కాదు పట్టపగలు కూడా దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతున్నారు. వరుసగా జరుగుతున్న ఘటనలు… జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత 10 రోజుల్లో 16 నేరాలు నమోదయ్యాయి. కొందరు దొంగలను పట్టుకున్న పోలీసులు… అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకోలేకపోతున్నరు. దొంగతనాలు జరిగిన కొన్ని ప్రాంతాల్ల… పోలీసులు కనీసం ఆధారాలు కూడా సేకరించలేకపోతున్నారనే విమర్శలున్నాయి.

ఈ మధ్య చంద్రి అనే దొంగ.. తాళం వేసున్న ఇళ్లే టార్గేట్ గా.. ఏకంగా 60 కి పైగా దొంగతనాలు చేశాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. ఇక్కడోళ్లే కాకుండా… బీహార్, మహరాష్ట్ర, కర్ణాటక నుంచి.. కొన్ని ముఠాలు దొంగతనాలు చేస్తున్నరు. శివారు ప్రాంతాల్ల లాడ్జీలలో దిగి… రెక్కీ చేసి మరీ నాలుగైదు ఇళ్లల్లో ఒకేసారి దొంగతనాలు చేస్తున్నారు. ఎవరైనా వస్తే దాడులు చేయడం… అందినకాడికి దోచుకోవడం సర్వసాధారణమైపోయింది. ఈ మధ్య అల్వాల్  పీఎస్ పరిధిలో… ఓ మాజీ సైనికుడి ఇంట్లో 5 తులాల బంగారం, 50 వేల నగదును దోచుకెళ్ళారు. వనస్థలిపురంలో ఓ కుటుంబం ఊరికి వెళ్లి తిరిగొచ్చేలోపే.. 5 తులాల బంగారం, 5 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఇక రాజేంద్రనగర్ పీఎస్ లిమిట్స్ లో.. ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని గాయపర్చి.. 25 తులాల బంగారం, మూడున్నర లక్షలు ఎత్తుకెళ్లారు. చిల్కలగూడ పీఎస్ పరిధిల 50 తులాల బంగారు అభరణాలు ఎత్తుకెళ్లారు దొంగలు.

ఒకరిద్దరు దొంగలు పట్టుబడుతున్నా…. అంతర్రాష్ట్ర దొంగల విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటున్నారు జనం. దోపిడీ చేయటమే కాకుండా… ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడని దోపిడీ దొంగలపై ప్రత్యేక దృష్టి పెట్టాలంటున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy