బీ అలర్ట్ : నాలుగు రోజులు వర్షాలే

rains-hyderabadఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ మీదుగా ద్రోణి ఏర్పడిన నేపథ్యంలో మంగళవారం(ఆగస్టు-15) రాష్ట్రమంతటా ఓ మోస్తరుగా.. రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం(ఆగస్టు-14) వెల్లడించింది. ద్రోణితోపాటు బంగాళాఖాతంలో కోస్తా తీరం వెంబడి సముద్ర మట్టానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం నెలకొని ఉన్నది. ఈ ప్రభావంతో మంగళవారం(ఆగస్టు-15) సాధారణ వర్షాలు, బుధ, గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావాలతో నైరుతి రుతుపవనాలు గడిచిన 24 గంటల నుంచి రాష్ట్రంలో చురుకుగా కదులుతున్నాయని చెప్పారు. గత ఆరురోజులుగా వర్షాలు పుంజుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నాయి. ఈ వర్షాలతో పంటలు జీవం పోసుకుంటున్నాయి.  పత్తి, మక్కజొన్న, సోయా, కంది తదితర పంటలకు ప్రాణం పోసినట్టయింది. వరిసాగుపై సందిగ్ధంలో ఉన్న ఆయకట్టు రైతులు నాట్లు ముమ్మరం చేశారు.

రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో భారీ వానలు

గడిచిన 24 గంటల్లో పాత కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల, ఖమ్మం జిల్లా కోహెడలో అత్యధికంగా 10 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పాత నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, తాడ్వాయిల్లో 8 సెం.మీ, బాన్సువాడ, ఆదిలాబాద్, రెంజల్, నిజాంసాగర్, సదాశివనగర్, ఖానాపూర్, గూడూరులో 6 సెం.మీ వర్షపాతం నమోదైంది.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy