బీ అలర్ట్ : మరో 24 గంటల్లో భారీ వర్షాలు

rains-hyderabadతెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్నాయని అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రాబోయే 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వానలు పడనున్నాయి. కొత్తగూడెం, నాగర్ కర్నూల్, జగిత్యాల, వనపర్తి, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో ఈ పరిస్థితి ఉంటుందని నోట్ విడుదల చేసింది. ఉపరితల ద్రోణి, తేమ గాలులు, క్యుములోనింబస్ మేఘాల కారణంగా ఆదివారం (ఏప్రిల్-8) తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం కురిసిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ కూడా సోమవారం (ఏప్రిల్-9)న ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులు కూడా ఉండొచ్చని ప్రకటించింది. దీంతో రైతులు, నగర వాసులు ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సూచించారు అధికారులు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy