బీ అలర్ట్ : రెండు రోజులు వర్షాలు

alertమరో 48 గంటలు అకాల వర్షాలకు అవకాశం ఉందని చెబుతోంది వాతావరణ శాఖ. ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ భారీ వర్షాలు పడనున్నట్లు అలర్ట్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కూడా పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంమీదుగా ఆవరించిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు పడుతున్నాయి. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో.. కొన్ని ప్రాంతాల్లో కుండపోత వాన పడే సూచనలు కూడా ఉన్నాయి. పగటి ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 40 నుంచి 42 డిగ్రీల వరకు నమోదుకానున్నాయి. వేడిగాలులు కూడా వీయనున్నాయి. సాయంత్రం తర్వాత.. గాల్లో తేమ శాతంలో వచ్చే మార్పులతో అకాల వర్షాలు పడనున్నట్లు ప్రకటించింది వెదర్ డిపార్ట్ మెంట్. ఇవాళ, రేపు కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు అధికారులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy