బీ కేర్ ఫుల్ : మరో రెండు రోజులు నిప్పుల కుంపటే

sunభానుడి భగభగలు.. వేడి సెగలతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే సూర్య కిరణాల రూపంలో నిప్పుల వాన కురుస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు.  మరో రెండు రోజులు అంటే.. 23వ తేదీ వరకు ( మంగళ, బుధవారం) ఎండలు దంచి కొడతాయని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే వాతావరణం కొనసాగుతోందని… ఇవాళ కూడా తీవ్రంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నాయని తెలిపింది. మధ్య, వాయువ్య భారతం నుంచి వీస్తున్న గాలులే  కారణమని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. రేపు, ఎల్లుండి కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆసీఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, భద్రాచలం ప్రాంతాల్లో ఉష్ణోగ్రత అధికంగా ఉండనుంది. గరిష్టంగా 46 డిగ్రీల వరకు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ లోనూ 42, 43 డిగ్రీల వరకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉండనుంది. రాత్రి ఏడు గంటల వరకు కూడా ఎండ సెగ పెరగనుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండలో తిరిగితే వడదెబ్బ తగిలే అవకాశం కూడా ఉంది. ఈ క్రమంలోనే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచిస్తోంది వాతావరణ శాఖ. మరో రెండు రోజులు జనం అంతా అప్రమత్తతతో ఉండి.. ఎండ నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు అధికారులు.

ఆదివారం(మే 21) నమోదైన ఉష్ణోగ్రతలు

హకీంపేట్- 40.3

హన్మకొండ -45

హైదరాబాద్ -42

మహబూబ్ నగర్- 43.6

నల్గొండ -44.4

నిజామాబాద్ -43.9

రామగుండం -44.6

ఆదిలాబాద్-44.3

ఖమ్మం- 43

మెదక్ -43.6

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy