బీ రెడీ : 29 నుంచి మెట్రో రైల్ సర్వీసులు

Hyderabad-metroహైదరాబాద్ మెట్రో రైలు నవంబర్ 28వ తేదీన ప్రారంభం అవుతుందని ప్రకటించారు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. 29వ తేదీ నుంచి సర్వీసులు కూడా నడపనున్నట్లు వెల్లడించారు. ఆరు నెలలు తక్కువ సంఖ్యలో రైళ్ల రాకపోకలు ఉంటాయని.. ఆ తర్వాత పూర్తిస్థాయిలో సర్వీసులు తిరుగుతాయన్నారు. సీఎస్ ఎస్పీ సింగ్ ఆధ్వర్యంలో భేటీ అయిన సమన్వయ కమిటీ సమావేశంలో ఈ విషయాలను తెలిపారు.

28వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతులమీదుగా మెట్రో ప్రారంభం అవుతుందన్నారు. రైలు కొద్దిదూరం మోడీ ప్రయాణిస్తారని చెప్పారు. పట్టాలెక్కనున్న హైదరాబాద్ మెట్రో రైలుకు అన్ని అనుమతులు వచ్చాయని వెల్లడించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy