బుద్ధ పూర్ణిమ : మద్యం, మాంసం అమ్మకాలపై నిషేధం

MEAT BUNDమద్యం, మాంసం అమ్మకాలపై నిషేధం విధిస్తూ శ్రీలంక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుద్ధుని జయంతి వేడుకల క్రమంలో శ్రీలంక ఈ నిర్ణయం తీసుకుంది. బుద్ధుని జయంతి వేడుకల్లో భాగంగా రెండు రోజులపాటు నిర్వహించే వెషాక్ ఫెస్టివల్ ఆదివారం (ఏప్రిల్-29) నుంచి ప్రారంభం కానుంది. ఈ రెండు రోజులపాటు సూపర్‌ మార్కెట్లు, హోటళ్లలో మాంసం, మద్యంను విక్రయించరాదని ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడిచింది. సాధారణంగా బుద్ధ పూర్ణిమ సమయంలో శ్రీలంకలో బార్లు, రెస్టారెంట్లు మూసివేస్తారు. అయితే తొలిసారిగా మాంసం విక్రయంపై కూడా ఆంక్షలు విధించింది శ్రీలంక ప్రభుత్వం.

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy