బుల్లి “మగధీర” ఇకలేడు..!

ram-charan-fanమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను మెప్పించిన చిన్నారి కన్నుమూశాడు. మగధీర డైలాగులతో అందరినీ మురిపించిన పరశురామ్ కామెర్లతో శుక్రవారం ఉదయం తనువు చాలించాడు. పరశురామ్ డైలాగులు సామాన్యులనే కాదు.. చెర్రీతోనే శభాష్ అనిపించాయి. మగధీర సినిమాలోని భైరవ, రణదేవ్ బిల్లా, షేర్ ఖాన్ ఇలా మూడు పాత్రలకి సంబంధించిన డైలాగ్స్ చెప్పి.. ఔరా అనేలా చేశాడు.

అప్పట్లో పరశురామ్ ని పిలిపించుకుని మరీ ఆ డైలాగులు విన్నాడు చెర్రీ. ఎలా అయిన చదివించాలని, అతని చదువుకి అయ్యే ఖర్చులు తాను భరిస్తానన్నాడు. అంతేకాదు ఆరెంజ్ సినిమాలో తాను వేసుకున్న టీ షర్ట్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. అతన్ని ఎత్తుకొని కాసేపు సరదాగా మాట్లాడాడు. అయితే మళ్లీ చరణ్ ని కలిసే లోపే పరశురామ్ చనిపోయాడు. అతని మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పరశురామ్ ని టీవీలలో చూసి మురిసిన ఎందరో అభిమానులు అతని మృతికి నివాళులు అర్పిస్తున్నారు.  ఈ విషయం తెలుసుకున్న రామ్‌చరణ్‌ ఫేస్‌బుక్‌ ద్వారా సంతాపం తెలిపారు. పరశురాం ఇకలేరని తెలిసి షాక్‌ అయ్యానని, తీవ్రంగా బాధపడ్డానని అన్నారు. అతడి లోటును మాటల్లో వివరించలేమని చెప్పారు. ఇలాంటి కష్ట సమయంలో ఆ కుటుంబానికి పూర్తి ప్రేమ అందుతుందని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేసిన రామ్ చరణ్.. సోదరుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy