బుల్లీ డీజే.. బుజ్జీ డీజే

WPTV-DJ-AJ-kid-at-turntables_1428851889883_16617744_ver1.0_640_480

ఈ చిన్నోడే డీజే

అతడో డీజే. సీడి పెట్టి… మ్యూజిక్ మిక్స్ చేశాడా. ఇక అంతేసంగతులు… ఊపు రానోళ్లు కూడా తీన్మార్ డ్యాన్సేస్తారు. అంత ఫర్ ఫెక్ట్ డీజే అన్నమాట అతడు. అలా అని…అతడో చేయి తిరిగిన డీజే అనుకుంటే పొరబాటే. ముక్కపచ్చలారని… మూడేళ్ల చిన్నోడు. రీమిక్స్ చేస్తూ.. కుర్రకారును ఉర్రూతలూగిస్తున్నాడు. ఇంతకీ ఎక్కడా…చోటా డీజే. ఆ పోరగాడి పేరు ఓరటిల్వే హ్లోంగ్ వేన్. ఇతనిది సౌతాఫ్రికా. వీడి వయస్సు…మొన్ననే రెండెళ్లి మూడు పడ్డాయి. సరిగ్గా మాటలు కూడా రావు. కానీ…ఈ చిన్నోడు మ్యూజిక్ రీమిక్స్ చేశాడంటే డ్యాన్సులేయాల్సిందే. ఈ చిన్నోడికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే ఇతని అసలు పేరును కూడా మార్చేశారు. ఓరటిల్వే హ్లోంగ్ వేస్ అంటే తెలుసో తెలియదో కానీ డీజే ఏజే అంటే మాత్రం సౌతాఫ్రికాలో ప్రతొక్కరికీ తెలుసు. ఏజే అంటే ఆర్చ్ జూనియర్. సింపుల్ గా డీజే ఏజే అంటారు ఫ్యాన్స్.

ఏజే తండ్రి ఓ సాధారణ ఎంప్లాయ్. రెండేళ్ల వయస్సులో..తండ్రి ఐపాడ్ లో ఉన్న డీజే యాప్ ద్వారా మ్యూజిక్ ప్లే చేయడం నేర్చుకున్నాడట. అలా..డెయిలీ మ్యూజిక్ మిక్స్ చేస్తూ తెగ ఊగిపోయేవాడట. అది గమనించిన పేరెంట్స్…వాడిని మరింత ఎంకరేజ్ చేశాడు. ఈ చిన్నోడి కోసం…ఏకంగా ఓ డీజే సెట్ నే కొనుకొచ్చారు. అలా రెండేళ్ల వయస్సులోనే…డిజే మారి చాలా ప్రదర్శనలు ఇచ్చాడీ చిన్నోడు. రోజు రోజుకు ఏజేకి ఫ్యాన్స్ పెరుగారు. రీసెంట్ గా జోహెన్నెన్ బర్గ్ లో ప్రదర్శన ఇస్తే… అభిమానులు భారీగా తరలి వచ్చారు. అంతెందుకు…ఇప్పుడు చిన్నోడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కు రిబ్బెన కటింగ్ చేసే పేద్ద సెలబ్రెటీ అయిపోయాడట.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy