బుల్లెట్ ట్రైన్స్ కు 97వేల కోట్లిస్తానన్న జపాన్

japan-offers-india-soft-loan-for-15-billion-bullet-train-in-edge-over-chinaఇండియాకు బంపర్ ఆఫర్ ఇచ్చింది జపాన్. మన దేశంలో బుల్లెట్ రైళ్ల కోసం… దాదాపు 97వేల కోట్లు లోన్ ఆఫర్ చేసింది. అయితే ఊరికే కాదు… తమకు పనికొచ్చేలా కొన్ని కండీషన్స్ పెట్టింది. వీటన్నింటిపై కేంద్ర కేబినెట్ లో చర్చ జరగాల్సి ఉంది. ఆ తర్వాతే… జపాన్ లోన్ యాక్సెప్ట్ చేసేది లేనిది తేలనుంది.

బుల్లెట్ ట్రెయిన్స్ కు 15 బిలియన్ డాలర్లు

ఇండియాలో బుల్లెట్ ట్రెయిన్స్ ప్రవేశపెడతామని కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. అయితే… దానికి అవసరమైన టెక్నాలజీ, సరిపడ డబ్బులు మన దగ్గరలేవు. దీన్నీ  తమకు అనుకూలంగా మలచుకునేందుకు జపాన్, చైనా తెగ పోటీపడుతున్నాయి. బుల్లెట్ ట్రెయిన్ టెక్నాలజీలో దూసుకెళ్తున్న ఆ రెండు దేశాలు… ఇండియాలో కాంట్రాక్ట్ దక్కించుకునేందుకు ట్రై చేస్తున్నాయి. ఇక జపాన్ అయితే… ఒక అడుగు ముందుకేసి 15బిలియన్ డాలర్ల లోన్ ఇస్తామని  ఆఫర్ చేసింది. దీనిపై 1శాతం కంటే తక్కువ వడ్డీ చెల్లిస్తే చాలంది.

ముంబయి-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రెయిన్ ప్రతిపాదనలున్నాయి. ఈ రెండు సిటీల మధ్య 505కిలోమీటర్ల బుల్లెట్ ట్రెయిన్ కాంట్రాక్ట్ కోసం చైనా, జపాన్ ల మధ్య పోటీ ఉంది. గత నెలలోనే ఢిల్లీ-ముంబయి  మార్గంలో 1200 కిలోమీటర్ల హైస్పీడ్ ట్రెయిన్ సర్వే కాంట్రాక్ట్ ను చైనా దక్కించుకుంది. ఈ పరిస్థితుల్లో ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రెయిన్ కాంట్రాక్ట్ దక్కించుకోవాలని జపాన్ పట్టుదలగా ఉంది. దీంతో 15బిలియన్ డాలర్లు అంటే… దాదాపు 97వేల కోట్లు లోన్ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. అయితే కండీషన్స్ అప్లై అంది. ప్రాజెక్ట్ కోసం 30పర్సెంట్ ఎక్విప్ మెంట్ అంతా జపనీస్ కంపెనీల నుంచే కొనుగోలు చేయాలని మెలిక పెట్టింది.

ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రెయిన్ ఏర్పాటైతే… ఆ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం 7గంటల నుంచి 2గంటలకు తగ్గుతుందని… సర్వే చేసిన జపాన్స్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ లెక్కలేసింది. లోన్ కు సంబంధించిన రిపోర్ట్ ను ఇండియన్ గవర్నమెంట్ కు అందజేసింది JICA. భారత రైల్వే అధికారులతో… జపాన్ రైల్వే అధికారులు చర్చిస్తున్నారు. కేంద్ర మంత్రివర్గం  ఆ రిపోర్ట్ పై త్వరలోనే చర్చించనుంది.

సాయం వెనక అసలు కథ

ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రెయిన్ కాంట్రాక్ట్ కోసం… జపాన్ ఇంత పట్టుదలగా ప్రయత్నించడం వెనక ఇంకో స్టోరీ కూడా ఉంది. ఇండోనేషియా హై స్పీడ్ ట్రెయిన్ కాంట్రాక్ట్ ను చైనా దక్కించుకుంది. ఆ దేశ రాజధాని జకార్తా బాండుంగ్ ల మధ్య హై స్పీడ్ రైల్ కాంట్రాక్ట్ కోసం… ఎలాంటి పూచీకత్తు లేకుండానే ఇండోనేషియాకు 5బిలియన్ డాలర్ల లోన్ ఇస్తామని చైనా ఆఫర్ చేసింది. చైనాకే ఆ కాంట్రాక్ట్ దక్కింది. దీంతో జపాన్ ప్రధాని షింజో అబే కూడా… సీరియస్ గా రియాక్టయ్యారు. ఇండియాతో పాటు… ఆగ్నేయాసియాలో… ట్రాన్స్ పోర్ట్ ఎక్స్ పోర్ట్స్ సిస్టమ్ సెటప్ చేయాలని ఆర్డర్స్ ఇచ్చారు.

ఇక జపాన్ ఆఫర్ ను… ఇండియా యాక్సెప్ట్ చేసే అవకాశాలున్నాయని సమాచారం. దీనికి… చైనా మీదున్న అయిష్టతే కారణంగా చెబుతున్నారు. 1962లో చైనాతో యుద్ధం, దాని వల్ల ఏర్పడ్డ సమస్యలు, సరిహద్దు వివాదాలు ఇంకా పరిష్కారం కాలేదు. పైగా ఇండియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లో చైనా ఇన్వాల్వ్ మెంట్ అధికారులకు ఇష్టంలేదట. అందుకే జపాన్ కు రూట్ క్లియర్ అయ్యే చాన్సెస్ ఉన్నాయని ఢిల్లీ సమాచారం.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy