బెంగళూరులో ప్రత్యక్షమయిన రజినీకాంత్

 

31BGCTY2-1_1738360fనిజజీవితంలో వేషం వేశారు సూపర్ స్టార్ రజనీకాంత్. మారు వేషంలో బెంగళేరులో ఐదు రోజులు హాయిగా తిరిగారు. తన చిన్నప్పుడు సంచరించిన పలు ప్రాంతాలను మారువేషంలో తిరుగాడారు. విశ్రాంతి కోసమే ఇక్కడకు వచ్చిన ఆయన తన స్నేహితుడు ఉంటున్న రేస్‑కోర్సు రోడ్డులోని గోల్ఫ్‑ వ్యూ అపార్ట్‑మెంట్‑లో విడిది చేశారు. ఆయన సోదరుడు, ప్రాణ స్నేహితులు చాలామంది బెంగళూరులో ఉన్నారు. దీంతో రజనీ బెంగళూరు వచ్చినప్పుడల్లా అభిమానుల కళ్లుగప్పి మారువేషంలో తాను చిన్నప్పుడు తిరిగిన రోడ్లు, మాస్ హోటల్స్, టిఫిన్ సెంటర్లకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. ఈ అయిదు రోజులు కూడా ఆయన తన స్నేహితులతో కలిసి మారువేషంలో నగర రహదారులపై ఉత్సాహంగా గడిపినట్లు సమాచారం.

అయితే ఈ విషయాన్ని అభిమానులు పసిగట్టేసారు. వెంటనే పెద్ద ఎత్తున రజనీకాంత్ నివాసం దగ్గరకు చేరుకుని జై రజనీకాంత్…జై జై రజనీకాంత్ అంటూ నినాదాలు చేశారు. రజనీ ఉన్న విషయం తెలుసుకున్న అపార్టమెంట్ వాసుల కూడా వీరికి తోడయ్యారు. చివరకు చేసేదేంలేక రజనీకాంత్ బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు.దీంతో ఒక్కసారిగా నినాదాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా రజనీకాంత్‑తో ఫోటోలు తీయించుకునేందుకు పోటీ పడ్డారు.చివరకు పోలీసులు జోక్యం చేసుకుని అభిమానులను అదుపు చేయాల్సి వచ్చింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy