బెంగాల్ పంచాయతీ పోలింగ్ : దాడులతో గ్రామాల్లో యుద్ధ వాతావరణం

MAMAవెస్ట్ బెంగాల్‌ లో సోమవారం (మే-14) ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ హింసాత్మకంగా మారింది. గ్రామాల్లో రెండు గ్రూపుల మధ్య ఘర్షణలతో యుద్ధవాతావరణం నెలకొంది. కూచ్ బెహర్ జిల్లాలో జరిగిన ఘర్షణల్లో 20 మంది గాయపడ్డారు. ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్ దగ్గరకు వెళ్లిన వారిపై TMC కార్యకర్తలు కర్రలతో దాడిచేసినట్లు స్ధానికులు తెలిపారు. దాడిలో గాయపడినవారిని ట్రీట్ మెంట్ కోసం MJN హాస్పిటల్ కు తరలించారు. మరోవైపు కూచ్ బెహర్ లోని బూత్ నెం.8/12 దగ్గర పోలీసుల ఎదుటే బీజేపీ కార్యకర్తపై రాష్ట్ర మంత్రి రవీంద్రనాథ్ ఘోష్ దాడి చేశారు. అయితే బీజేపీ ఏజెంట్ బ్యాలెట్ బాక్స్ ని తీసుకుని పరుగెత్తేందుకు ప్రయత్నించడంతో అధికారులు అతడ్ని అడ్డుకున్నారని.. కొంతమంది అతడ్ని అక్కడి నుంచి వెళ్లనివ్వమనడంతో తాను అతడిపై చేయి చేసుకున్నానని TMC ఎవరిపై దాడులు చేయడం లేదని రవీంద్రనాథ్ తెలిపారు.
అధికార, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగటంతో చాలా ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బిర్ పరాలో పోలింగ్ బూత్ దగ్గర మీడియా కవరేజ్ చేస్తున్న ఏడుగురు జర్నలిస్టులు.. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో గాయపడ్డారు.

ఈ ఎన్నికల్లో ఈవీఎం మిషన్‌లకు బదులుగా బ్యాలెట్‌ పేపర్లను ఉపయోగిస్తున్నారు. చాలా చోట్ల ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చే ఓటర్లపైనా దాడులు జరిగాయి. అధికార – ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. TMC కార్యకర్తలు అసన్‌ సోల్‌, కూచ్‌ బిహార్‌లో బాంబులు విసిరారు. అంతేకాకు ఓటర్లను భయపడుతూ… విధ్వంసకర చర్యలకు పాల్పడ్డారు. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగుతుంది.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy