బెంగాల్ లో దారుణం: ప్రిసైడింగ్ అధికారి హత్య

Rajkumar Royపశ్చిమ బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో ఓ ఎన్నికల అధికారి దారుణ హత్య జరిగింది. ఉత్తర దినాజ్‌పూర్‌లో జరిగిన ఈ సంఘటన రాష్ట్రం వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రహత్‌పూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్న రాజ్‌కుమార్‌ రాయ్‌…రాయ్‌గంజ్‌లోని ఇతహార్‌ ప్రాంతానికి ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారిగా వెళ్లారు. పోలింగ్‌ జరిగే సమయంలో కొందరు అడ్డుకొవడానికి ప్రయత్నించగా ఆయన వారిని అడ్డుకున్నారు.

అయితే పోలింగ్‌ పూర్తయిన తర్వాత రాయ్‌ అకస్మాత్తుగా అదృశ్యమై పోయారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎన్నికల రోజు తన భర్త రాయ్‌ పోలింగ్‌ బూత్‌లో ఉండగా రాత్రి 8 గంటలకు మాట్లాడానని… ఆ తర్వాత మాట్లాడటానికి ప్రయత్నించినా కుదరలేదని తెలిపారు ఆయన భార్య అర్పిత. దీంతో అనుమానం వచ్చి రాయ్‌ కిడ్నాప్‌ అయ్యారని  ఇతహర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మరుసటి రోజు సోనాదంగి రైల్వే స్టేషన్‌ సమీపంలో గుర్తు పట్టలేని స్థితిలో రాయ్‌ మృతదేహం ముక్కలు ముక్కలుగా పడివుంది. రాయ్‌ మరణంపై  ఆయన భార్య అనుమానాలు వ్యక్తం చేశారు.

దీనిపై సీబీఐ విచారణ చేయాలని అర్పిత డిమాండ్‌ చేశారు. రాజ్‌కుమార్‌ రాయ్‌ దారుణ హత్యపై ఇతర ఎన్నికల అధికారులు, స్కూలు ఉద్యోగులు బుధవారం(మే-16) నిరసనకు దిగారు. రాయ్‌ మరణంపై తగిన న్యాయం చేయాలంటూ రోడ్లపై నిరసనకు కార్యక్రమం చేపట్టారు. రాయ్‌ హత్యపై ఫిర్యాదు చేస్తే పోలీసులు తిరస్కరించారని వారు ఆరోపించారు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందన్నారు. దీనిపై పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం స్పందించింది. కేసు విచారణను సీఐడీకి అప్పగించనున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy