బెజవాడలో మహాత్మునికి అవమానం

GANDHI-STATUEఈ మధ్య ఆంధ్రాలో కూల్చివేతల జోరుగా సాగుతున్నాయి. రోడ్ల విస్తరణ పేరిట నడిరోడ్డుపై ఏది అడ్డంగా ఉన్నా ఏమాత్రం ఆలోచన లేకుండా బుల్డోజర్ ల సాయంతో మరీ తీయించేస్తున్నారు. మొన్నటి బెజవాడ ఆలయాల సంగతి మర్చిపోక ముందే.. తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. ఈసారి దేశనాయకులపై పడ్డారు అధికారులు. ఆ తొలగింపేదో మర్యాదకరంగా సాగితే పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు కానీ.. అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా చేయడంతోనే విమర్శలకు దారితీస్తుంది. జాతిపిత గాంధీజీ విగ్రహాన్ని తొలగించే సందర్భంలో కాస్త డ్యామేజ్ అయింది. దీన్ని కప్పిపుచ్చడానికి ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి చెరువులో వేసేశారు అధికారులు. అది ఎలా బయటపడిందో ఏమో.. జనానికి తెలియడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గాంధీజీ  విగ్రహాలు వెలుస్తుంటే.. సొంత దేశంలో ఈ అవమానం ఏంటనే తీవ్ర ఆవేదన చెందుతున్నారు బెజవాడ జనం.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy