బెనరస్ వర్సిటీలో ఐదుగురు అధికారుల సస్పెన్షన్

benarasబెనారస్‌ హిందూ యూనివర్సిటీ ఘటనపై ఐదుగురు అధికారులను సస్సెండ్ చేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. బెనారస్‌ హిందూ యూనివర్సిటీ విద్యార్థులపై లాఠీచార్జి చేసిన ఆరోపణలపై ముగ్గురు అదనపు సిటీ మెజిస్ట్రేట్‌లను, ఇద్దరు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లను విధుల నుంచి తప్పించింది ప్రభుత్వం. లైంగిక వేధింపుల ఘటనపై నిరసన వ్యక్తం చేస్తున్న వెయ్యి మంది విద్యార్థినీ, విద్యార్థులను పోలీసులు విచక్షణారహితంగా లాఠీలతో కొట్టారు. వర్సిటీ క్యాంపస్ లో నడుచుకుంటూ వెళ్తున్న ఒక యువతి పట్ల గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించారు. ఆ ముగ్గురు వ్యక్తులపై చర్య తీసుకోవాలని నిరసన వ్యక్తం చేస్తూ వీసీని కలవడానికి వెళ్ళిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి జరిపారు. ఇద్దరు జర్నలిస్టులు సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

శనివారం రాత్రి ఈ ఘటన జరిగినపుడు ప్రధాని వారణాసి పర్యటనలో ఉన్నారు. పోలీసు ముందుజాగ్రత్త చర్యగా విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేయడం బెడిసికొట్టింది. ఘటనపై సీఎం యోగి విచారణకు ఆదేశించారు. దాడిని కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ ఖండించాయి. గాయపడ్డ విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్లిన 200 మంది సమాజ్‌వాదీ కార్యకర్తలను పోలీసులు నిర్బంధించారు. వేరే కార్యక్రమం మీద వారణాసి వచ్చిన సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ను కూడా అరెస్టు చేశారు పోలీసులు. శుక్రవారం ప్రధాని వారణాసి పర్యటనకు వచ్చారు. ధర్నాకు దిగిన విద్యార్థులు నక్సలైట్లని వ్యాఖ్యానించారు బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి. అయితే, వర్సిటీ విద్యార్థుల ఉద్యమానికి ఏబీవీపీ కూడా మద్దతు  ఉండడంతో ఆయన వ్యాఖ్యలను ఆ రాష్ట్ర ప్రభత్వం పట్టించుకోలేదు. పరిస్థితి తీవ్రతను గ్రహించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బీజేపీ నేతలు లాఠీచార్జిని దురదృష్టకర ఘటనగా అభివర్ణించారు. ప్రధాని మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాలు సీఎం యోగితో ఫోన్లో మాట్లాడారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని ఆదేశించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy