బెన్ స్టోక్స్ @ రూ. 14.50 కోట్లు

ipl-2017బెంగళూరులో ఐపీఎల్ పదో సీజన్ కోసం ఆటగాళ్ల వేలం కొనసాగుతోంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఇంగ్లండ్ ప్లేయర్ బెన్ స్టోక్స్ ఎక్కువ ధరకు అమ్ముడుపోయాడు. స్టోక్స్ ను పూణె జట్టు… 14కోట్ల 50 లక్షలకు కొనుక్కుంది. స్టోక్స్ బేస్ ప్రైస్ 2 కోట్లు కాగా…. పుణె, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై జట్టు అతన్ని దక్కించుకునేందుకు పోటీ పడ్డాయి. చివరి నిమిషం వరకు ఢిల్లీ, ముంబై రేసులో నిలిచినా….. ఆఖరికి పూణె దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలో 16 కోట్లకు అమ్ముడుపోయిన… యువరాజ్ సింగ్ రికార్డు ఇంకా అలాగే ఉంది.

అంతకు ముందు….. ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ను ….. 2 కోట్ల రూపాయల బేస్ ప్రైస్ కు దక్కించుకుంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు. గత సీజన్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ తరపున మోర్గాన్ ఆడాడు. శ్రీలంక ఆల్ రౌండర్ ఏంజిలో మ్యాథ్యూస్ ను 2 కోట్లకు ఢిల్లీ డేర్ డెవిల్స్ దక్కించుకుంది. ఇక న్యూజిలాండ్ ఆల్ రౌండర్ కోరె అండర్సన్ ను కోటి రూపాయలకు కొనుగోలు చేసింది ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు.

ఇండియన్ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కనీస ధర 50 లక్షలు ఉండగా…. అతని కోసం ఫ్రాంచైజీలు ఇంట్రస్ట్ చూపించలేదు. కనీస ధర 30 లక్షలుగా ఉన్న ఇండియన్ ఆల్ రౌండర్ పవన్ నేగీని…. కోటికి కొనుగోలు చేసింది రబెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు. ఇక న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ మార్టిన్ గుప్టిల్, ఇంగ్లండ్ బ్యాంట్స్ మెన్ జేసన్ రాయ్, అలెక్స్ హేల్స్, న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ రాస్ టేలర్ లను కూడా ఫ్రాంచైజీలు కొనుగోలు చేయలేదు.

ఇక ఇంగ్లండ్ కు చెందిన టైమల్ మిల్స్ ను 12 కోట్లకు దక్కించుకుంది బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు. న్యూజిలాండ్ కు చెందిన ట్రెంట్ బౌల్ట్ కూడా 5 కోట్లు పలికాడు. అతన్ని కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు దక్కించుకుంది. ఇక సౌతాఫ్రికా బౌలర్ రబడను ఢిల్లీ డేర్ డెవిల్స్ దక్కించుకుంది. 5 కోట్లకు కొనుగోలు చేసింది. పాట్ కమిన్స్ ను ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు 4 కోట్ల 50 లక్షలకు దక్కించుకుంది. ఆసీస్ పేస్ బౌలర్ మిచెల్ జాన్స్ ను ముంబై ఇండియన్స్ జట్టు 2 కోట్లకు కొనుగోలు చేసింది.

నాథన్ కౌల్టర్, నైల్, దినేష్ చండిమాల్, జాన్సన్ చార్లెస్, కైల్ అబాట్, ఇషాంత్ శర్మ కూడా అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో చేరారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy