‘బెర్లిన్ వాల్’ కూలి…ఈరోజు తో 25 ఏళ్ళు…

Absperrungsmassnahmen am Brandenb.Tor - Barbed-wire barricades/Berlin Wall/1961 - Fil de fer barbele a la Porte de Brandebజర్మనీ చరిత్రలో మరిచిపోలేని రోజు…. ప్రపంచాన్నే జర్మనీ ఎట్రాక్ట్ చేసిన రోజు…. ప్రజలమధ్యన అంతరాలు తొలిగి…… విడిపోయిన దేశాలు మళ్ళీ కలిసి చరిత్ర సృష్టించిన రోజు…… ఈరోజు. బెర్లిన్ గోడను కూల్చి నేటితో 25 ఏళ్ళు పూర్తయ్యాయి.

జర్మనీని వెస్ట్ జర్మనీగా, ఈస్ట్ జర్మనీగా విడగొట్టి రెండింటి మధ్యలో బెర్లిన్ సిటీలో గోడ కడుతున్నట్లు 1961 ఆగస్ట్ 15న అప్పటి సోషలిస్ట్ యూనిటీ పార్టీ సెక్రటరీ వాల్టర్ ఊల్ బ్రిస్ట్ ప్రకటించారు.

అసలు ఇలా రెండు దేశాలుగా ఎందుకు విడిపోయాయంటే  …. రష్యా దేశానికి జర్మనీ తూర్పు ప్రాంతం దగ్గరగా ఉండడంతో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ఆ ప్రాంత పాలకులు కమ్యూనిస్ట్ భావజాలానికి మద్దతుగా ఉంటూ రష్యాకు సపోర్ట్ చేశారు. మరోవైపు, పశ్చిమ జర్మనీ ప్రాంతం డెమోక్రాటిక్ సిద్ధాంతాలను నమ్ముకుంది. దీంతో, అలా చాలా కాలం పాటు రెండు ప్రాంతాల మధ్య విభేదాలు పెరిగాయి. తూర్పు ప్రాంతంలో కమ్యూనిస్ట్ పాలన ఉండటంతో అక్కడి ప్రజలు ఆ పరిపాలనలో స్వేచ్చగా బ్రతకలేకపోయారు. అందుకే,  ఎక్కువమంది పశ్చిమ ప్రాంతానికి వలసలు వెళ్ళేవారు.

తూర్పు జర్మనీ నుంచి ప్రజలు పశ్చిమ జర్మనీకి వలసలు వెళ్తున్నారని గోడ కట్టాలని నిర్ణయం తీసుకున్నారు తూర్పు జర్మనీ పాలకులు. దీంతో, చాలామంది ఈస్ట్ జర్మనీ ప్రజలు ఇబ్బంది పడ్డారు కానీ అప్పుడు పాలకులను ప్రశ్నించలేకపోయారు. గోడ నిర్మాణం మొదలైంది. కట్టడం పూర్తయింది. గోడ బోర్డర్స్ లో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేయడంతో….. ఇక అక్రమంగా కూడా వలసలు వెళ్ళడం బంద్ అయ్యాయి. అయినా కూడా వేలాదిమంది అక్రమంగా పశ్చిమ ప్రాంతానికి వెళ్లాలని ప్రయత్నించి దొరికిపోయారు. అలా దొరికిన వాళ్ళలో చాలా మందిని జైలులో వేశారు, ఇంకొంత మందిని కాల్చి చంపారు అక్కడి పాలకులు.

రోజులు గడిచాయి….జర్మనీలు రెండూ కలవాలని ఉద్యమాలు జరిగాయి. అలాగే, బెర్లిన్ గోడ కూల్చాలని ఆందోళనలు పెరిగాయి….ఇక ఎంతోకాలం ఇలా ప్రజలను కట్టడి చేయలేమని చేతులెత్తేసి రెండుదేశాలను కలపాలని డిసైడ్ అయ్యారు తూర్పు జర్మనీ పాలకులు. ఇంటర్నేషనల్ లెవెల్ లో దీనిపై చర్చలు జరిపి చివరికి 1989 నవంబర్ 9న జర్మనీ పాలకులు గోడను కూల్చేశారు. మళ్ళీ యునైటెడ్ జర్మనీ ఏర్పాటైంది. దీంతో, ప్రతి ఏడు ఇదేరోజున జర్మనీ ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈసారి కూడా కూడా భారీ ఎత్తున సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి రెడీ అయ్యారు అక్కడి ప్రజలు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy