బెల్లంపల్లి – సమస్యల లొల్లి

bellampali

కార్మికుల సపోర్ట్ తో కమ్యూనిస్ట్ పార్టీ పాగా వేసిన ప్రాంతం. సింగరేణిలో తనకంటూ గుర్తింపు చాటుకున్న నియోజకవర్గం బెల్లంపల్లి. తెలంగాణకే తలమానికమై సింగరేణికి వెన్నుదన్నుగా నిలుస్తున్న నియోజకవర్గం. ఒక ప్రాంతం  అభివృద్దిలో ఉంటే, మరో ప్రాంతం అభివృద్దికి ఆమడదూరం. పక్కనే ప్రాణహితనది పారుతున్నా….గొంతు తడవదు, గుంట భూమి సాగవదు. రాజకీయ రచ్చలతో…. గ్రూపు తగాదాలతో పొలిటికల్ హీట్ ఉండే ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంపై స్పెషల్ స్టోరీ.

 • బెల్లంపల్లి ఎస్సీ రిజర్వ్ డ్ స్థానం.
 • మొత్తం ఓటర్లు 1,56,915.
 • పురుష ఓటర్లు 79, 822. మహిళా ఓటర్లు 77,079.
 • మొత్తం ఓటర్లలో ఎస్సీలు 60 శాతముంటే, బీసీలు 20 శాతం, ఎస్టీలు 5 శాతం, ఇతరులు 15శాతం.
 • బెల్లంపల్లి నియోజకవర్గంలో కాసిపేట, బెల్లంపల్లి, తాండూరు, భీమిని, నెన్నెల, వేమనపల్లి మండలాలున్నాయి.
 • బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో 34 డివిజన్లున్నాయి.
 • బెల్లంపల్లి టౌన్, తాండూరు మండల కేంద్రం మినహా మిగతావన్ని పూర్తిస్థాయిలో వెనకబడిన మండలాలు.
 • 2009 లో జరిగిన నియోజకవర్గాల పునర్ విభజనలో బెల్లంపల్లి నియోజకవర్గం ఏర్పడింది.

అంతకుముందు బెల్లంపల్లి, భీమిని, తాండూరు మండలాలు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఉండేవి. కాసిపేట మండలం లక్సెట్టిపేట నియోజకవర్గంలో ఉండేది. నెన్నెల, వేమనపల్లి మండలాలు చెన్నూరు నియోజకవర్గంలో ఉండేవి. మూడు నియోజవర్గాల్లోని మండలాలతో కలిపి బెల్లంపల్లి నియోజకవర్గం ఏర్పడింది.

 • కొత్తగా ఏర్పడిన బెల్లంపల్లి సెగ్మెంట్ లో మొదటిసారి సీపీఐ జెండా ఎగరేసింది.\
 • గత ఎన్నికల్లో సి.పి.ఐ అభ్యర్థి గుండా మల్లేష్ మహాకూటమి తరుఫున బరిలో దిగారు.
 • టీఆర్ఎస్, టీడీపీ మద్ధతుతో 8,892 ఓట్ల మెజారిటితో గెలిచారు.
 • సీపీఐ శాసనసభాపక్ష నేతగా మల్లేష్ పేరు తెచ్చుకున్నారు.
 • గత ఎన్నికల్లో టీఆర్ఎస్, టీడీపీ మద్దతుతోపాటు సింగరేణి కార్మికులు అండగా నిలిచారు.
 • రైతులు కూడా మల్లేష్ కే ఓటేశారు.
 • మల్లేష్ అంతకుముందు ఆసిఫాబాద్ నుండి 1983, 1985 లో రెండుసార్లు గెలిచారు.
 • తరువాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు.
 • ఖమ్మం, నల్లగొండ జిల్లాలో బలంగా ఉన్న సీపీఐకి గుండామల్లేష్ గెలుపుతో ఆదిలాబాద్ లోనూ ఊపొచ్చింది.
 • కార్మిక నేతగా, కమ్యూనిస్ట్ నాయకుడిగా ఆయనపై నియోజకవర్గ ఓటర్లు, కార్మికులు, ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

2009లో అందరి మద్దతుతో  గెలిచిన గుండా మల్లేష్ కు ఈసారి గెలుపు అంత ఈజీ కాదనిపిస్తోంది. ఆయన పాలనపై ఓటర్లు పెదవి విరుస్తున్నారు.

 • అభివృద్ది విషయంలో ఎమ్మెల్యే తగినంత ప్రాధాన్యత చూపించలేదన్నది జనం అభిప్రాయం.
 • నెన్నెల, భీమిని, వేమనపల్లి మండలాల్లో నీటి ఎద్దడిని తీర్చకపోవడం మల్లేష్ కు మైనస్ గా మారింది.
 • ఇక సమస్యలు చెప్పుకునేందుకు ఎమ్మెల్యే అందుబాటులో ఉండరనేది ఆయనపై ఉన్న మరో ఆరోపణ.
 • బెల్లంపల్లి వేమనపల్లికి రోడ్డును నిర్మించాలని ఏళ్ల నుంచి డిమాండ్ ఉంది. దానికి మల్లేష్ హామీ కూడా ఇచ్చారు. కానీ అది నోచుకోలేదు.
 • బెల్లంపల్లి పట్టణంలో నీటి సమస్య తీవ్రస్థాయిలో ఉంది.
 • ఇక బిల్లులు రాకపోవడంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మద్యలోనే ఆగిపోయిందని, ఎమ్మెల్యేకు విన్నవించుకున్నా ప్రయోజనం లేదంటున్నారు స్థానికులు.

…………………….

ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి చిన్నయ్య, టీడీపీ నుంచి పాటి సుభద్ర, వైసీపీ నుంచి ఎరుకల రాజ్ కిరణ్ పోటీలో నిలబడుతున్నారు.

 • కాంగ్రెస్, సీపీఐ పొత్తు వల్ల కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధులను బరిలోకి దించడం లేదు.
  • …………………

    బెల్లంపల్లి సెగ్మెంట్ లో టీడీపీకి గట్టిపట్టే ఉండేది. పార్టీ కేడర్ గ్రామాల్లో బలంగా ఉంది. టీడీపీ తరఫున పాటి సుభద్ర బరిలో నిలచున్నారు.

    • సుభద్ర 1999 లో ఆసిఫాబాద్ నియోజకర్గం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
    • అయితే తెలంగాణ వ్యతిరేక ముద్ర ఆమెకు మైనస్ గా మారే అవకాశముంది.

    ……………………
    నిజానికి, బెల్లంపల్లి నియోజకవర్గం సమస్యల నిలయం. అన్ని రంగాల్లోనూ అభివృద్ధిలో వెనకబడి ఉంది. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యాపారం, వ్యవసాయం అన్నింటిలోనూ వెనకబడి ఉంది.

    • వేసవిలో మంచినీటి సమస్య తాండవం చేస్తుంది.
    • మంచినీటి సమస్య పరిష్కారం కోసం గోదావరినది నుంచి పైప్ లైన్ కు చాలాకాలంగా డిమాండ్ ఉంది.
    • వైద్య సదుపాయం కోసం హాస్పిటల్ ఉన్నా డాక్టర్స్ అందుబాటులో ఉండరన్న అపవాదుంది.
    • ఇక బస్సు డిపో నిర్మాణం డిమాండ్ కూడా పెండింగ్ లో ఉంది.
    • కాసిపేట దేవాపూర్ లో ఓరియంట్ సిమెంట్ ప్యాక్టరీ గిరిజనుల నుంచి భూములను లాక్కుంది. కంపెనీ పరిహారం ఇప్పటివరకు చెల్లించలేదు.
    • నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పిస్తామన్న మేనేజ్ మెంట్ కంటితుడుపుగా కొందరికి ఉద్యోగాలిచ్చి చేతులు దులుపుకుంది.
    • ప్రాణహిత –  చేవెళ్ల ప్రాజెక్టుపై నియోజవర్గ అభివృద్ధి ఆధారపడి ఉంది.
    • దాంతోపాటు వేమనపల్లి నీల్వాయి ప్రాజెక్టు నిర్మాణదశలోనే ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే 13 వేల ఎకరాలకు సాగునీరుతో పాటు కొన్ని గ్రామాలకు తాగునీరు అందించవచ్చు.

    వీటితోపాటు మరికొన్ని సమస్యలున్నాయి. వాటిపై భరోసా ఇచ్చే అభ్యర్థికే ఓటేస్తామంటున్నారు బెల్లంపల్లి ఓటర్లు. తెలంగాణ క్రెడిట్ తో టీఆర్ఎస్ పోటీపడుతుండటంతో సిట్టింగ్ అభ్యర్థి గుండా మల్లేష్ కు కష్టాలు తప్పేలా లేవన్నది క్లియర్ గా తెలుస్తోంది. అయితే సీపీఐ, కాంగ్రెస్ పొత్తుతో గుండా మల్లేష్ కు కాంగ్రెస్ మద్దతుదారుల నుంచి పూర్తి సహకారం లభించనుంది. ఇది మల్లేష్ కు కలిసివచ్చే అంశంగా మారనుంది. ఎవరు పోటీకి నిల్చున్నా తమ సమస్యలను తీర్చే అభ్యర్థికి మాత్రమే పట్టం కడతామంటున్నారు ఓటర్లు.

     

     

  Comments are closed.

  © 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
  Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
  without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy