బేకరీ ఆఫర్ : కేజీ కేక్ కొంటే..లీటర్ పెట్రోల్ ఫ్రీ

చెన్నై : పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్న క్రమంలో ..దీనినే కొందరు బిజినెస్ గా వాడుకుంటున్నారు. తమ షాపులో రూ.495 బిల్లు చేసినవారికి లీటర్ పెట్రోల్ ఫ్రీ అనే ఆఫర్ పెట్టాడు ఓ బేకరి షాపు యజమాని. ఒక కిలో కేక్‌ కొంటే లీటరు పెట్రోలు ఫ్రీగా ఇస్తామనడంతో క్యూ కట్టారు కస్టమర్లు.

చెన్నైలోని ఓ బేకరీ షాపు ఈ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఒక కిలో కేక్.. ఏదైనా బేకరీ ఫుడ్ పై రూ .495 బిల్లు చేస్తే.. 1 లీటరు పెట్రోలు ఫ్రీ అని ప్రకటించింది. ఇటీవల ఓ పెళ్లి వేడుకలో వధూవరులకు 5 లీటర్ల పెట్రోలును గిఫ్గ్ గా ఇవ్వగా..ఇప్పుడు బేకరీ షాపు ఆఫర్ ప్రకటించడంతో పెట్రోపై ధరలపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy