బేగంపేట క్యాంపు ఆఫీసుకు సీఎం కేసీఆర్..

KCR YAGAM-IMAGE1సీఎం కేసీఆర్ ఎట్టకేలకు బేగం పేట క్యాంపు ఆఫీసుకు నివాసం మార్చారు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యుల సమక్షంలో క్యాంపు ఆఫీసులోకి ప్రవేశించారు. మంత్రి కేటీఆర్, ఎంపీ కవితతో సహా కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. ముందుగా నిర్ణయించిన మహూర్తం ప్రకారం 10.48 గంటలకు గృహ ప్రవేశం చేశారు. ఆ తర్వాత  సుదర్శన యాగంలో పాల్గొన్నారు. వాస్తు దోష నివారణ కోసం ప్రత్యేక పూజలు చేశారు.

ఇక సీఎం నివాసంపై మొదట్నుంచీ ఎటూ తేల్చుకోలేకపోయారు అధికారులు. బేగంపేట వాస్తు దోషాల కారణంగా ఆయన కుందన్ భాగ్ నివాసంలో ఉండేందకు ఇంట్రెస్ట చూపించారు. కానీ కుందన్ భాగ్ క్యాంప్ ఆఫీసులో సౌకర్యాలు నచ్చకపోవడంతో మళ్లీ బేగంపేట క్యాంపు ఆఫీసులోనే ఉండేందుకు నిర్ణయించుకున్నారు. అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాక ఆదివారం ఉదయం గృహ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేవలం ఫ్యామిలీ మెంబర్స్ కే అనుమతి ఉండటంతో.. అక్కడికొచ్చిన ఎమ్మెల్యేలు వెనుదిరిగారు.

KCR YAGAM-IMAGE2 KCR YAGAM-IMAGE4 KCR YAGAM-IMAGE3

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy