బైక్ ను ఢీకొన్న GHMC టిప్పర్..నలుగురు మృతి

accidentనిన్న రాత్రి  తిరుమ లగిరిలో ఘోర  రోడ్డు ప్రమాదం  జరిగింది. ముగ్గురు పిల్లలతో టూవీలర్ పై  వెళ్తున్నవారిని.. వెనుకనుంచి  టిప్పర్  ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు  చనిపోయారు. పిల్లలు అమాన్ , అశ్వియా, అలీమా, తండ్రి మహ్మద్ అజార్  అక్కడికక్కడే  మృతిచెందారు. ఇమ్రాన్  బేగంను  యశోద హాస్పిటల్లో  చేర్పించారు . వీరంతా సికింద్రాబాద్ లోని  బన్సీలాల్ పేటకు  చెందినవారిగా గుర్తించారు. GHMC టిప్పర్  ఢీకొట్టడంతో…. న్యాయం చేయాలని బాధితుల బంధువులు అక్కడ ఆందోళన చేపట్టారు. వెస్ట్ జోన్  డీసీపీ వారిని సముదాయించి.. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy