బైబ్యాక్ లో ఇన్ఫోసిస్ షేర్ ధర రూ.1150

Infosysబైబ్యాక్.. షేర్ మార్కెట్ తెలిసి వారికి ఈ పదం పరిచితమే. అంటే వాటాదార్లకిచ్చిన షేర్లను తిరిగి వారి నుంచే సదరు కంపెనీ కొనుగోలు చేయడాన్ని బైబ్యాక్‌ అంటారు. దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇప్పుడదే పని చేస్తోంది. 36 ఏళ్ల చరిత్రలో తొలిసారి షేర్లను తిరిగి కొనుగోలు చేస్తోంది. ఇన్ఫీ సీఈవో విశాల్‌ సిక్కా రాజీనామా చేసిన మరుసటి రోజే బైబ్యాక్‌ నిర్ణయం వెలువడటం గమనార్హం. రూ. 13వేల కోట్లతో షేర్ల బైబ్యాక్‌ చేయనున్నట్లు ఇన్ఫోసిస్‌ ప్రకటించింది. ఒక్కో షేరును రూ.1,150 ధరకు కొనుగోలు చేస్తామని పేర్కొంది. శనివారం నాటి మార్కెట్‌ ట్రేడింగ్‌లో ఇన్ఫీ షేరు ముగింపు ధర రూ. 932కు 25శాతం ప్రీమియం ఇస్తూ ఈ షేర్లను తిరిగి కొనుగోలు చేస్తామని తెలిపింది.

జూన్‌ 30, 2017 నాటికి ఇన్ఫోసిస్‌ వద్ద రూ. 22వేల750కోట్ల అదనపు నగదు ఉంది. కాగా.. ఇన్ఫీకి ముందే.. పలు ఐటీ కంపెనీలు షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించాయి. టీసీఎస్‌ రూ. 16వేల కోట్ల మెగా బైబ్యాక్‌ను ఆఫర్‌ చేయగా.. విప్రో రూ. 2500 కోట్లతో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ రూ. 3,500కోట్లతో బైబ్యాక్‌ను ప్రకటించాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy