కళాత్మక జీవనం అంటే వారిదేనేమో…

523013_8de9941fde04b0d38dab37163672e3ac_largeఇల్లేకాదా స్వర్గసీమ. ఏరికోరి కట్టుకున్న బొమ్మరిల్లుకు నచ్చిన రంగులేసుకోవడం కొందరికి ఇంట్రెస్ట్. అది కొందరికి ఆర్ట్ కూడా. కానీ ఓ ఊరు ఊరంతా ఒకే డిజైన్ తో రంగులేసుకుంటే. అది ఆ ఊరి సంప్రదాయంగా మారితే. ఊరు మొత్తం ఓ కాన్వాస్ కనిపిస్తే. అది టైబేలే విలేజ్ అవుతుంది. ఆ విశేషాలేంటో మీరూ చూడండి.

ఇంటికి అందరూ పెయింట్స్ వేసుకుంటారు. రకరకాల డిజైన్స్ తో ఇంటిని అందంగా ముస్తాబు చేస్తారు. కానీ టైబెలెలో అలా కాదు. అన్ని ఇళ్లకీ ఒకేలా రంగులేస్తారు. ఒకేలా డిజైన్ చేస్తారు. ఇళ్లకే కాదు… కిరాణా కొట్లకి, బావులకి, కచ్చీర్లకి… అన్నిటికీ అవే రంగులు, సేమ్ డిజైన్. దాంతో ఆ ఊరే పెద్ద కాన్వాస్ లా కనిపిస్తుంది.  ఒకే రకమైన డిజైన్ లో టైబేలో ఓ టూరిస్ట్ స్పాట్ లా మారింది. ఇంతకీ ఇదెక్కడుందో చెప్పలేదు కదూ. ఆఫ్రికాలోని ఓ బుల్లి దేశం బూకీనా ఫాసోలో ఉందీ గ్రామం. పుట్టెడు పేదరికంలో ఉండే ఈ దేశం… సాంస్కృతికంగా మాత్రం చాలా రిచ్.

2580780709_40c5cfdc2b_b

గతంలో ఈ దేశం పేరు అప్పర్ వోల్టో(upper volta). 1980లో బూకీనా ఫాసో(Burkina faso)గా మారింది. అంటే గౌరవనీయ వ్యక్తుల దేశం అని అర్థం. అలాంటి బూకీనా ఫాసోలో మల్టిపుల్ కల్చరల్ యాక్టివిటీస్ కు పట్టుగొమ్మలా మారింది టైబెలె గ్రామం. బూకీనా ఫాసోలోని…. పో అనే టౌన్ కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ఊరు.

Burkina-Faso_XT2AW

టైబేలేలో ప్రతి ఇల్లూ ఒక కాన్వాసే. ప్రతి గృహమూ ఒక కళాక్షేత్రమే. టైబెలెలో కసెన అనే తెగ నివసిస్తుంది. సంప్రదాయ కళలు, బిల్డింగ్ నాలెడ్జ్ లో వీళ్లు పాపులర్. అందుకే వాళ్ల ఇళ్ల గోడలు… నిలువెత్తు కళాదృశ్యాలుగా మారిపోయాయి. ప్రతి ఇంటి గోడ మీదా చక్కని రంగులతో వేసిన డిజైన్ కనిపిస్తుంది. ఇది కళ్లకు ఎంతో అందంగాను, మనసుకు ఆహ్లాదంగాను అనిపిస్తుంది. 16వ శతాబ్దం నుంచి ఈ ఊరు ఇలాగే ఉంటోందట. స్థానికంగా దొరికే మట్టి, పేడ, కలప, గడ్డి మొదలైన వాటితో ఇళ్లను అందమైన చిత్రాలుగా మారుస్తున్నారు కసెన తెగ మహిళలు. ఇలా రంగులు వేయడం వల్ల దుష్టశక్తులు దరిచేరవన్నది వీళ్ల నమ్మకం.

149396134.5zKi5FQ4.07Intheroy_naFasoకసెన తెగవారికి నమ్మకాలు చాలా ఎక్కువ. భార్యాభర్తలు వాళ్ల పిల్లల కోసం కట్టుకొనే ఇళ్లు, పెళ్లి కాని వాళ్ల కోసం కట్టిన ఇళ్లు, ముసలివాళ్ల కోసం మరో రకమైన ఇళ్లు. ఇలా మూడు రకాలుగా కడతారు. కొత్తగా ఇల్లు కట్టి, దాన్ని కళాత్మకంగా ముస్తాబు చేయగానే అందులోకి వెళ్లరు. బయట కొన్ని రోజులు వెయిట్ చేస్తారు. తమ ఇంటికి దేవుడి ఆశీస్సులు  ఉన్నాయో లేదో తెలుసుకోవడానికే ఈ నిరీక్షణ. ఓ బల్లి రావాలి. ఆ ఇంటి గోడల మీద పాకాలి. అప్పుడు దైవం ఆశీస్సులు లభించినట్లు భావించి, గృహప్రవేశం చేస్తారు. ఎన్ని రోజులు గడిచినా బల్లి కనిపించకపోతే ఆ ఇంటిని కూల్చేస్తారే తప్ప. అందులోకి వెళ్లరు. అక్కడ పర్యాటకులకూ కొన్ని షరతులుంటాయి. ఎవరూ ఎరుపు రంగు బట్టలు వేసుకోకూడదు. గొడుగు పట్టుకోకూడదు. అవి ఆ ఊరి పెద్దమనుషులు మాత్రమే వాడాలి. ఇవీ టైబెలె ప్రత్యేకతలు. బతకడం వేరు, కళాత్మకంగా బతకడం వేరు. రెండో సూత్రానికి న్యాయం చేసింది టైబెలె. అందుకే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ లో చోటు సంపాదించుకుందీ ఊరు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy