బోటు ప్రమాదంలో 22 మంది మృతి: బాధిత కుటుంబాలకు సీఎం భరోసా

chతూర్పుగోదావరి జిల్లా మంటూరు.. పశ్చిమగోదావరి జిల్లా వాడపల్లి మధ్య జరిగిన బోటు ప్రమాదంలో మొత్తం 22 మంది చనిపోయినట్టుగా గుర్తించారు. 12మంది మృతదేహాలు బయటకు తీశారు. ఇందులో నలుగురు చిన్నారులు ఉన్నారు. ప్రమాదంలో గల్లంతైన వారికోసం గజఈతగాళ్లతో గాలిస్తున్నారు. నేవీ , ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు … ప్రమాద స్థలంలో సహాయక చర్యల్లో రోజంతా పాల్గొన్నారు. నదిలో 45 అడుగుల లోతులో పడవ మునిగిందని అధికారులు గుర్తించారు. ఇసుకలో కూరుకుపోయిన బోటును… భారీ క్రేన్ సాయంతో ఎంతో శ్రమించి బయటకు తెచ్చారు రెస్క్యూ సిబ్బంది.

బోటు అద్దాలు, కిటీకీలు పగలకొట్టి  8 మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలకు అక్కడే పోస్టుమార్టమ్ నిర్వహించి బాధిత కుటుంబాలకు అప్పగించారు. బాధితుల రోదనలతో.. ప్రమాద స్థలంలో విషాదం అలుముకుంది.

మధ్యాహ్నం ఘటన స్థలం చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే చేశారు. సహాయక చర్యలను పరిశీలించారు. లాంచీ ప్రమాదానికి కారణాలను అడిగితెలుకున్నారు. మృతుల కుటుంబీకుల, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మృతుల కుటుంబాలకు పది లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. బోటు నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందన్నారు చంద్రబాబు.

గోదావరిలో పడవ మునక ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు ఏపీ హోంమంత్రి చినరాజప్ప. సహాయక చర్యలను సమీక్షించిన ఆయన.. లాంచీల కండీషన్, పర్యాటక ప్రాంతాల్లో తనిఖీలు, భద్రతా ప్రమాణాలను త్వరలోనే పరిశీలిస్తామని చెప్పారు. గోదావరి ప్రమాదం గురించి తెలియగానే గుండె బరువెక్కిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో స్పందించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం గిరజనులకు శాపం కాకూడదని అన్నారు. జవాబుదారీతనం లేని పాలనా విధానాలే అమాయకులని జలసమాధి చేశాయన్నారు పవన్ కల్యాణ్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy