బోణీ అదిరింది : ప్రోకబడ్డీలో ‘తెలుగు టైటాన్స్ ‘ విక్టరీ

20374755_1694967317477308_4958600428433548269_nగత నాలుగు సీజన్ లలో స్పోర్ట్స్ ప్రియులను ఆకట్టుకున్న ప్రో కబడ్డి ఐదో సీజన్ ఘనంగా ప్రారంభమైంది. ప్రొ కబడ్డీ లీగ్‌లో ఆతిథ్య తెలుగు టైటాన్స్‌ జట్టుకు ఘనమైన ఆరంభం లభించింది. శుక్రవారం ( జూలై-28)న జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లో టైటాన్స్‌ 32–27 పాయింట్ల తేడాతో తమిళ్‌ తలైవాస్‌ను చిత్తు చేసింది. మూడు సార్లు డూ ఆర్‌ డై రైడింగ్‌లలో పాయింట్లు రాబట్టిన నీలేశ్‌ సాలుంకే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

రాహుల్‌ సూపర్‌ 10…ఇరు జట్లు తొలి రైడ్‌లలో రక్షణాత్మక ధోరణి కనబర్చగా… ప్రపంజన్‌ పాయింట్‌తో తమిళ్‌ ముందుగా ఖాతా తెరిచింది. ఆ తర్వాత రాహుల్‌ ప్రదర్శనతో టైటాన్స్‌ 4–3తో ఆధిక్యంలో నిలిచింది. అయితే తలైవాస్‌ పోరాడటంతో స్కోరు 8–8తో సమమైంది. ఈ దశలో నీలేశ్‌ రెండు పాయింట్లతో మళ్లీ ఆధిక్యంలో నిలపగా… తర్వాతి నిమిషంలో ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసి తెలుగు టీమ్‌ 14–8తో దూసుకుపోయింది. తొలి అర్ధ భాగం ముగిసే సరికి టైటాన్స్‌ 18–11తో ముందంజలో ఉంది. రెండో అర్ధ భాగంలో కోలుకున్న తలైవాస్‌ ఆఖర్లో గట్టి పోటీనిచ్చింది. 37వ నిమిషంలో టైటాన్స్‌ 32–21తో గెలుపునకు చేరువైంది.

రాహుల్, నీలేశ్‌ దూకుడైన ఆట టైటాన్స్‌ను గెలిపించింది.  సచిన్, చిరంజీవిలాంటి   ప్రముఖులు యజమానులుగా తొలిసారి లీగ్‌లోకి అడుగు పెట్టిన తమిళ్‌ తలైవాస్‌   నిరాశాజనకంగా లీగ్‌ను    ప్రారంభించింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy