బోయపాటి స్టైల్ మారిందా: జయ జానకీ నాయక టీజర్ రిలీజ్

jaya-janaki-nayakaబోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘జయ జానకి నాయక’ టీజర్ రిలీజైంది. బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా నటిస్తుండగా.. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్లు. మిర్యాల రవీందర్‌ నిర్మాత. వచ్చే నెల 11న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బోయపాటి స్టైల్ కు భిన్నంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మాస్ సినిమాల డైరెక్టర్ కుటుంబ బంధాలకూ చోటిస్తూ.. వాటినే హైలెట్ చేస్తూ ఈ సినిమా చేస్తున్నారు. అదే టీజర్ లో ప్రతిఫలించింది. “శ్రీనివాస్‌ లుక్‌కీ, టైటిల్‌కీ మంచి స్పందన వస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ పాటలు ఆకట్టుకొంటాయ’’న్నారు నిర్మాత.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy