బోర్డర్ లో ప్రధాని…జవాన్లతో దీపావళి

modiదేశ భద్రత కోసం రాత్రింబవళ్లు..కంటి మీద కునుకులేకుండా కాపలా కాస్తున్న జవాన్లు తన కుటుంబంలో భాగమన్నారు ప్రధాని నరేంద్రమోడీ. గురువారం( అక్టోబర్-19) జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గురేజ్ వ్యాలీలో ఆర్మీ, BSF జవాన్లతో కలసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జవాన్లకు ప్రధాని స్వీట్లు తినిపించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మీ జవాన్లు తన కుటుంబ సభ్యులని, అందుకే వీరితో దీపావళి జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చానన్నారు మోడీ.

జవాన్లతో కొంత సమయం గడిపిన తర్వాత తనకు కొత్త శక్తి వచ్చిందని, కఠినమైన పరిస్థితుల్లో కూడా దేశం కోసం వారు పడుతున్న తపన, త్యాగాన్ని ప్రశంసిస్తున్నానన్నారు. దీనిక సంబంధించి ప్రధాని0 ట్వీట్ చేశారు. జవానులంతా ఒక దగ్గరచేరి క్రమం తప్పకుండా యోగా చేయాలని, ఇది కచ్చితంగా సామర్థ్యాన్ని పెంచడమే కాక, మనసును ప్రశాంతంగా ఉంచుతుందని వారికి చెప్పినట్లు మోడీ తెలిపారు. ఇలా చేస్తే పదవీ విరమణ పొందిన జవానులు అద్భుతమైన యోగా శిక్షకులుగా కూడా మారతారన్నారు.

సరిహద్దులో జవాన్లతో కలసి మోడీ దీపావళి సంబరాలు జరుపుకోవడం ఇది వరసగా నాలుగోసారి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy