బ్యాంకుల్లో రైతుబంధు రద్దీ : తళతళలాడే నోట్లు.. కళకళలాడే ముఖాలు

CASH BANKతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త పాస్ బుక్కులు.. చెక్కులు తీసుకుంటూ పండుగ వాతావరణం కనిపిస్తోంది. చెక్కులు తీసుకున్న రైతులు వెంటనే డబ్బుల కోసం బ్యాంకులకు వెళుతున్నారు. బ్యాంకుల్లోనూ రద్దీ పెరిగింది. రైతులు చెక్కులతో తరలివస్తుండటంతో.. క్యూలు పెట్టారు. ఇప్పటికే డబ్బులు రెడీగా ఉండటంతో.. ఇబ్బంది లేకుండా తీసుకుంటున్నారు.

అధికారులు కూడా బ్యాంకుల్లో రైతుబంధు చెక్కుల పంపిణీకి ప్రత్యేకంగా రెండు, మూడు కౌంటర్లు ఏర్పాటు చేశారు. చెక్కులు మార్చుకోవటానికి 90 రోజుల వరకు టైం ఉందని.. తొందర పడొద్దని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. 90 రోజుల్లో ఎప్పుడు వచ్చినా డబ్బులు ఇస్తామని.. ఒకే సారి అందరూ రావొద్దని కోరుతున్నారు. అందరూ ఒకేసారి రావటం వల్ల ఆలస్యం అవుతుందని చెబుతున్నారు. వృద్ధుల కోసం కుర్చీలు కూడా ఏర్పాటు చేశామని చెబుతున్నారు. నగదు కొరత లేదని.. ఈ విషయంలో పుకార్లను కూడా నమ్మొద్దని కోరుతున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy