బ్యాంక్‌ అక్రమాల్లో రూ లక్ష కోట్లు : RBI

RBIబ్యాంకుల్లో అవకతవకలు.. మోసాలతో కోట్లాది రూపాయల ప్రజాధనం పక్కదారిపడుతోందని తెలిపింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( RBI). గత ఐదేళ్లలో బ్యాంకుల్లో జరిగిన 23,000కు పైగా అవకతవకల కేసుల్లో రూ లక్ష కోట్ల ధనం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లిందని RBI తెలిపింది. బ్యాంకుల్లో ఏప్రిల్‌ 2017 నుంచి మార్చి 2018 వరకూ అవకతవకల కేసులు 5,152 కేసులకు పెరిగాయని RTI కింద కోరిన సమాచారానికి బదులిస్తూ ఆర్‌బీఐ చెప్పింది.

ఈ కేసుల్లో రూ 28,459 కోట్లు చిక్కుకున్నాయంది. ఇక 2016-17లో రూ 23,933 కోట్ల విలువైన 5976 అక్రమాల కేసులు బ్యాంకింగ్‌ రంగంలో నమోదయ్యాయని తెలిపింది. గత ఐదేళ్లలో మొత్తం లక్షా718 కోట్ల ధనం 23,866 అక్రమార్కుల అవకతవకల ఫలితంగా ఆవిరైందని…ఈ కేసులను సమగ్రంగా పరిశీలించి కేసుల వారీగా వాస్తవాలను కలుపుకుని చర్యలు చేపడుతున్నట్టు తెలిపింది ఆర్‌బీఐ. బ్యాంకుల్లో పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు భారీ రుణాల ఎగవేత కేసులు పేరుకుపోతున్న క్రమంలో ఆర్‌బీఐ చెప్పిన గణాంకాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy