బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

Bank_of_India1బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని వివిధ విభాగాల్లో ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. క్రెడిట్ ఆఫీసర్, మేనేజర్, సెక్యూరిటీ ఆఫీసర్, టెక్నికల్ విభాగంలోని అప్రైజల్, ప్రిమిజెస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

1) క్రెడిట్ ఆఫీస‌ర్: 270
విద్యార్హతలు: చార్టెడ్ అకౌంటెంట్/ ఐసీడబ్ల్యూఏ/ లేదా కామర్స్‌లో డిగ్రీతోపాటు ఫైనాన్స్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ/ ఎంబీఏ/ పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ మేనేజ్‌మెంట్/ పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అప్లికేషన్/ ఎంకామ్ ఉండాలి.
వయసు: 2017 ఏప్రిల్ 20 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్లకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

2) మేనేజ‌ర్‌: 400
విద్యార్హతలు: సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ లేదా కామర్స్‌లో డిగ్రీతోపాటు ఫైనాన్స్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ/ ఎంబీఏ/ పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ మేనేజ్‌మెంట్/ పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అప్లికేషన్/ ఎంకామ్ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం అయిదేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 2017 ఏప్రిల్ 20 నాటికి 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్లకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

3) సెక్యూరిటీ ఆఫీస‌ర్‌: 17
విద్యార్హతలు: కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఈ/ బీటెక్ ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
వయసు: 2017 ఏప్రిల్ 20 నాటికి 22 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ విభాగాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

4) టెక్నిక‌ల్ (అప్రైజ‌ల్‌/ ప్రిమిసెస్‌): 15
విద్యార్హతలు: ప్రిమిసెస్ విభాగానికి ఏదైనా డిగ్రీ ఉండాలి. అప్రైజల్ విభాగానికి కెమికల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్/ ప్రొడక్షన్/ మెటలర్జికల్/ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్‌ ఉండాలి. ఎంబీఏ అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. సంబంధిత విభాగంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 2017 ఏప్రిల్ 20 నాటికి 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్లకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా…
క్రెడిట్ ఆఫీసర్, మేనేజ‌ర్‌, సెక్యూరిటీ విభాగాలకు రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఏప్రిల్ 20
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివ‌రితేది: మే 05
టెక్నికల్ విభాగాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఏప్రిల్ 26
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివ‌రితేది: మే 12

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy