బ్యాట్స్ మెన్ వైఫల్యం- మ్యాచ్ గోవిందా!

nez

విదేశాల్లో తడబాటును టీం ఇండియా రిపీట్ చేస్తోంది. న్యూజిలాండ్ లో అయినా విక్టరీతో సిరీస్ స్టార్ట్ చేస్తారనుకుంటే..అక్కడా నిరాశపరిచింది. టార్గెట్ చేజింగ్ లో బ్యాట్స్ మెన్ ఫెయిలవడంతో.. ఫస్ట్ వన్డేను కివీస్ కు సమర్పించుకుంది. టాస్ గెలిచిన భారత జట్టు.. న్యూజిలాండ్ కు బ్యాటింగ్ అప్పగించింది. విలియమ్సన్ 71, టేలర్ 55, అండర్సన్ 68 రన్స్ చేసి రాణించడంతో.. కివీస్ జట్టు 50 ఓవర్లలో 292 పరుగులు చేసింది. భారత బౌలర్లలో షమీ 4 వికెట్లు తీసుకున్నాడు. 293 రన్స్ టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన భారత్.. ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ ను త్వరగా కోల్పోయింది. 32 రన్స్ చేశాక ధావన్ అవుటవడంతో.. వికెట్ల పతనం మొదలైంది. వన్డేల్లో 18వ సెంచరీ కంప్లీట్ చేసిన కోహ్లీ 123 రన్స్ దగ్గర ఔటయ్యాడు. కెప్టెన్ ధోనీ 40 పరుగులతో ఫెవిలీయన్ చేరాడు. మిగిలిన వారంతా త్వరగా అవుటయ్యారు. దీంతో.. 48.4 ఓవర్లలో 268 రన్స్ కు ఆలౌట్  అయ్యింది టీమిండియా. 24 పరుగుల తేడాతో ఓడిపోయింది. కివీస్ బౌలర్ మెక్ క్లెనాన్ 4 వికెట్లు తీశాడు. బ్యాటింగ్ లో అర్థ సెంచరీతోపాటు, 2 వికెట్లు పడగొట్టిన అండర్సన్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

ఈ మ్యాచ్లో ధోనీ ౩౦౦ వికెట్ల పతనంలో పాత్ర పోషించిన కీపర్ల జాబితాలో నాలుగోవాడుగా నిలిచాడు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy