బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో సారా ఎంట్రీ

sara-sushanthసైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ ‘కేదార్‌నాథ్’ మూవీతో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ‘ఎంఎస్ ధోనీ’ ఫేం సుశాంత్ సింగ్ రాజ్‌పుట్, సారా అలీఖాన్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ 3న ప్రారంభం కానుంది. అభిషేక్ కపూర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా కేదార్‌నాథ్‌లో జరిగిన లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుంది. ‘నేను ఎంతగానో విశ్వసించే లార్డ్ శివ కొలువుదీరిన పవిత్ర కేదార్‌నాథ్ స్థలంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నాం. ‘కేదార్‌నాథ్’ ఇప్పటివరకు వచ్చిన చిత్రాల్లో చాలా ప్రత్యేకమైందిగా నిలుస్తుందని ఖచ్చితంగా చెప్పగలను. ఈ మూవీ నా కెరీర్‌లో ది బెస్ట్ మూవీ అవుతుందని చెప్పాడు’ నిర్మాత భూషణ్ కుమార్.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy