బ్రతికుండగానే చనిపోయిందంటూ.. ఐదు లక్షల బీమా కాజేశాడు

2016-11-18T0910119Z_1_LYNXMPECAH0GF_RTROPTP_3_INDIA-MODI-CORRUPTION3డబ్బుల కోసం నానారకాల ప్లాన్ వేస్తున్నారు కొంతమంది బ్రోకర్లు. అయితే ఈ సంఘటన చూస్తే మాత్రం షాక్ కు గురి కావాల్సిందే. డబ్బుల కోసం ఏకంగా బ్రతికుండగానే తన భార్య రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని రూ .5లక్షలు కాజేశాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగింది. మిర్యాలగూడలోని LIC ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కిషన్ నాయక్, ఇటీవల తన భార్య రోడ్ యాక్సిడెంట్ లో మరణించిందని ఫేక్ డెత్ సర్టిఫికెట్లు సృష్టించి, ఐదు లక్షల ఇన్సురెన్స్ డబ్బులు కాజేశాడు. చివరకు ఆఫీసులో ఆనోటా ఈనోటా యాజమాన్యానికి అసలు విషయం తెలియడంతో కిషన్ నాయక్ బాండాగారం బయటపడింది.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy