బ్రిటన్ ఫిల్మ్ అవార్డ్సుకి మెర్సెల్ మూవీ

Vijay2017లో మోస్ట్ కాంట్రవర్షియల్ ఫిల్మ్ గా మెర్సల్ మూవీ నిలిచింది. GSTపై ఈ మూవీలోని డైలాగులు దేశవ్యాప్తంగా చర్చ అయ్యాయి. బీజేపీ నుంచి నిరసనలు కూడా వచ్చాయి. వివాదాల మధ్య ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టుకుంది. విజయ్ నటించిన ఈ సినిమా అతడి కెరీర్లోనే ది బెస్ట్ గా నిలిచింది. ఇప్పుడు మెర్సెల్ మూవీ ఖాతాలో మరో ఘనత చేరింది. నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ UK-2018కి భారత్ నుంచి మెర్సెల్ మూవీ నామినేట్ అయింది. UK నేషనల్ ఫిల్మ్ అకాడమీ ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ఈ అవార్డుకి మెర్సెల్ నామినేట్ అవడంపై విజయ్ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. ఇండియా నుంచే ఎంపికైన ఒకే ఒక చిత్రం ఈ మెర్సల్. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ (విజమ్ పర్ఫార్మెన్స్), బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీల్లో నామినేట్ అయింది. ఆడియన్స్ ఓట్ల ప్రకారం విజేతలను నిర్ణయిస్తారు. మార్చి28వ తేదీన అవార్ట్స్ ప్రకటిస్తారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy