బ్రిటన్ లో సచిన్ పేరుతో గోల్డ్ కాయిన్స్…

sachingoldcoinmటీమిండియా మాజీ క్రికెటర్, గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ కు మరో అరుదైన గౌరవం లభించింది. ఆయన పేరుతో గోల్డ్ కాయిన్స్ రిలీజ్ చేసింది బ్రిటన్ కు చెందిన లగ్జరీ గూడ్స్ బ్రాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. దాదాపు 12 వేల పౌండ్ల కాస్ట్ ఉండే వీటిని ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్ పేరిట రిలీజ్ చేసింది. చాలా అరుదుగా కనిపించే ఇలాంటి గోల్డ్ కాయిన్స్ 210 తయారు చేసింది ఈస్ట్ ఇండియా కంపెనీ.

coinsకంపెనీ తయారు చేసిన కాయిన్లలో ఒక్కోక్కటి 200 గ్రాముల బరువు ఉంటోంది. కాయిన్ కుడిపక్క ఎలిజబెట్ బొమ్మ ఉంటోంది. రెండో పక్క సచిన్ సైన్ చేసిన క్రికెట్ బ్యాట్ ఉంటోంది. 200 టెస్ట్ మ్యాచ్ లు ఆడినందుకు సచిన్ కు ఈ గౌరవం దొరికింది. తన పేరిట కాయిన్ రిలీజ్ చేయడంపై సచిన్ స్పందించాడు. నా జీవితమంతా..ఇండియా తరఫున క్రికెట్ ఆడేందుకే కేటాయించానన్నారు. 24 ఏళ్ల పాటు ఇండియా టీంతో క్రికెట్ ఆడానని గుర్తు చేసుకున్నాడు.

9034_10ఈ కాయిన్లను ప్రపంచంలోనే గుర్తింపు ఉన్న కాయిన్ డిజైనర్లు తయారు చేశారు. ఆ కాయిన్ పై గేట్ వే ఆఫ్ ఇండియా, సచిన్ హొం సిటీ ముంబాయి గుర్తులు ఉన్నాయి. వాటితో పాటు 200 టెస్ట్ మ్యాచ్ గుర్తు..అతను లాస్ట్ టెస్ట్ మ్యాచ్ లో కొట్టిన 187 రన్స్ ఉండేలా డిజైన్ చేశారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy