బ్రిస్బేన్ టీ20 : భారత్ పై ఆస్ట్రేలియా విక్టరీ

బ్రిస్బేన్ : మూడు టీ20ల సిరీస్ లో భాగంగా ఇవాళ నవంబర్-21న బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫస్ట్ టీ20లో ఓటమి పాలైంది భారత్. కోహ్లీ సేనపై 4 రన్స్ తేడాతో విక్టరీ సాధించింది ఆస్ట్రేలియా. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 17 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 రన్స్ చేసింది. 16వ ఓవర్ ముగిసిన సమయంలో మ్యాచ్ కి వర్షం అడ్డంకి కావడంతో 17 ఓవర్లకు కుదించారు. DLS అడ్జస్ట్ మెంట్ ప్రకారం 17 ఓవర్లకు భారత్ టార్గెట్ ను 174గా నిర్ణయించారు.

లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్ ప్రారంభంలోనే రోహిత్ శర్మ (7) నిరాశపరిచినప్పటికీ శిఖర్ ధావన్(76) దూకుడుగా ఆడిన ఫలితం లేకుండా పోయింది. చివరి వరకు నువ్వా.. నేనా అనేలా సాగిన మ్యాచ్ ..విక్టరీ ఆస్ట్రేలియా సొంతమైంది. వర్షం కారణంగా తడిసిముద్దయిన గ్రౌండ్.. భారత్ ఇన్నింగ్స్ కు పిచ్ సహకరించలేదు. భారత్ ప్లేయర్లలో ధావన్ (76), రిషబ్ పాంత్(20), దినేశ్ కార్తీక్(30) తప్ప..మిగతా ప్లేయర్లు రాణించలేకపోయారు. 17 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 రన్స్ చేసి ఓటమి పాలైంది కోహ్లీ సేన. చాలా రోజుల తర్వాత ఆస్ట్రేలియా సొంతగడ్డపై విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్ లో భారత్ 0-1 ఆధిక్యంలో ఉంది. సిరీస్ నిర్ణయాత్మకమైన సెకండ్ టీ20 మ్యాచ్ మెల్ బోర్న్ వేదికగా నవంబర్ 23న జరగనుంది.

ఆస్ట్రేలియా ప్లేయర్లలో..ఆరోన్ ఫించ్(27), క్రిస్ లిన్(37), గ్లెన్ మాక్సివెల్(46), మార్కస్ స్టోయినిస్(31) రన్స్ చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(2), ఖలీల్ అహమద్(1), బుమ్రా(1 ) వికెట్లు తీశారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy