బ్రేకింగ్ న్యూస్: విద్యుత్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై స్టే

highcourtహైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఇటీవల జారీ చేసిన విద్యుత్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది హైకోర్టు. ఈ నిర్ణయం నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో నాలుగు వారాల్లోగా ఈ అంశంపై కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఉన్నత న్యాయస్థానం. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఈ ప్రక్రియను ముందుకు సాగనివ్వొద్దని స్పష్టంచేసింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy