బ్లూవేల్‌ లో ప్రాణాలు పోకుండా బయటపడ్డ బాలికలు

blue-whale-gameమోస్ట్ డేంజరస్‌ గేమ్‌ బ్లూవేల్‌ మరోసారి భారత్‌లో తన ప్రభావాన్ని చూపించింది. అయితే ఈసారి అదృష్టవశాత్తూ ప్రాణాలు మాత్రం పోలేదు. పోలీసులు అప్రమత్తం కావటంతో ఇద్దరు యువతులు సురక్షితంగా బయటపడ్డారు.

ఆగ్రాలో తొమ్మిదో తరగతికి చెందిన ఇద్దరు విద్యార్థినిలు (14 ఏళ్లు) గత కొంతకాలంగా బ్లూవేల్‌ ఛాలెంజ్‌కు బానిసలయ్యారు. ఇప్పటికే రెండు లెవెల్స్‌ పూర్తి చేశారు  ఆ ఇద్దరు బాలికలు. ఆ తరువాతి లెవల్‌లో ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేసేందుకు సిద్ధపడ్డారు. వారు ఇంటి నుంచి పారిపోయారు. మంగళవారం ఆ ఇద్దరు ఎంచక్కా తమ బ్యాగులు సర్దుకుని ఉదయం 8 గంటలకు పంజాబ్ మెయిల్ ఎక్స్‌ప్రెస్‌ ను ఎక్కేశారు.  సెల్‌ ఫోన్‌ ట్రేస్‌ చేయటానికి వీల్లేకుండా స్విచ్ఛాఫ్ చేసేసుకున్నారు. సాయంత్రం స్కూల్‌ సమయం ముగియటంతో తల్లిదండ్రులు కంగారుపడిపోతారని భావించిన ఓ యువతి తన ఫోన్‌ ను ఆన్ చేసి సోదరుడికి అసలు విషయం చెప్పేసింది. వెంటనే అతను వారిద్దరిని తర్వాతి స్టేషన్‌లో దిగిపోవాలని సూచించాడు.

ఆ ఇద్దరు బాలికలు మధ్యప్రదేశ్‌ లోని హోషంగబాద్‌ రైల్వే స్టేషన్‌లో దిగి, అక్కడే ఎదురు చూడసాగారు. ఇంతలో వారిని గమనించిన రైల్వే భద్రతా సిబ్బంది చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌కి సమాచారం అందించారు. వెంటనే శిశు సంరక్షణ కమిటీ సభ్యులు అక్కడికి చేరుకుని వారిని తమ వెంట తీసుకెళ్లి అసలు విషయాలను ఆరాతీశారు. పిల్లల తల్లిదండ్రులు వచ్చాక వారి సమక్షంలోనే కౌన్సిలింగ్ ఇచ్చి పంపించివేస్తామని సీడబ్యూసీ సీనియర్‌ సభ్యుడు ఒకరు తెలిపారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy