
టాస్ గెల్చిన ముంబై ఇండియన్స్ పుణె టీమ్ ను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఫామ్ లో ఉన్న రాహుల్ త్రిపాఠి, కెప్టెన్ స్మిత్ వికెట్లు ఆదిలోనే పడగొట్టి ముంబై బౌలర్లు ఊపుమీద కనవడ్డారు. ఐతే.. రహానే , మనోజ్ తివారీలు హాఫ్ సెంచరీలు చేసి.. వికెట్లు పడకుండ కాపాడటమే కాకుండా.. టీమ్ ను కూడ ఆదుకున్నారు. చివర్లో ధోనీ 26 బంతుల్లో 40 రన్స్ చేయడంతో… పుణె 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 రన్స్ చేసింది.
బలంగ ఉన్న ముంబై బ్యాటింగ్ లైనప్.. ఈ స్కోరును ఈజీగ బీట్ చేస్తుందని అనుకున్నారంతా. కాని సీన్ రివర్సైంది. స్ట్రైకింగ్ బౌలర్ స్టోక్స్ లేకపోయినా… పుణె బౌలర్లు ఆకట్టుకున్నారు. సరైన సమయంలో వికెట్లు పడగొట్టుకుంటూ… ముంబైని దెబ్బతీశారు. సిమన్స్ త్వరగానే రనౌట్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ ఒకే ఓవర్ల రోహిత్ శర్మ, అంబటి రాయుడును ఔట్ చేసి ముంబైకి దడ పుట్టించాడు. ఆ తర్వాత ఓవర్లో పొలార్డ్ ను కూడా ఔట్ చేసి.. లోకల్ టీమ్ వెన్ను విరిచాడు. అంతే.. ముంబై… డిఫెన్స్ లో పడిపోయింది. గెలిపిస్తారనుకున్న అన్నదమ్ములు హార్దిక్ పాండ్య, కృణాల్ పాండ్య చేతులెత్తేశారు. మరోవైపు పట్టుదలగా ఆడిన పార్థివ్ పటేల్ తో కలిసి ఆడేవారే కరువైంది. పార్థివ్ 40 బంతుల్లో 52 రన్స్ చేసి ఏడో వికెట్ గా ఔటయ్యాడు.రన్స్ కొట్టేవారు లేకపోవడంతో.. రన్ రేట్ బాగా పెరిగిపోయింది.దీంతో ముంబై ఓటమి ఖాయమైంది. 20 ఓవర్లల్లలో 9 వికెట్లకు 142 రన్సే కొట్టింది ముంబై. దీంతో.. రైజింగ్ పుణె 20 రన్స్ తేడాతో గెల్చి సంబురం చేసుకుంది.
ధోనీ చివర్లో కొట్టిన రన్సే పుణె జట్టుకు బాగ ఉపయోగపడ్డాయ్. పుణె ఆటగాళ్లు చేసిన బౌలింగ్ కూడ శహెభాష్ అనిపించుకుంది. కొత్త కుర్రాడు వాషింగ్టన్ సుందర్ అదరగొట్టే పెర్ఫామెన్స్ తో 3 మెయిన్ వికెట్లు తీసి.. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మొట్టమొదటి సారి పుణె ఫ్రాంచైజీ ఐపీఎల్ ఫైనల్లో కాలుపెట్టింది. రెండో క్వాలిఫయర్ మ్యాచ్ లో గెల్చిన టీమ్ తో 21వ తారీఖు హైదరాబాద్ ఉప్పల్ లో టైటిల్ ఫైట్ ఆడనుంది పుణె.