భక్తురాలిపై రేప్ కేసు : ఫలహార బాబా అరెస్టు

falahari_maharaj_1_1834478_355x233-mలైంగిక దాడి కేసులో రాజస్థాన్‌కు చెందిన ఫలహార బాబాను శనివావారం(23) పోలీసులు అరెస్టు చేశారు. 21 ఏళ్ల భక్తురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లు బాబాపై ఆరోపణలు ఉన్నాయి. మూడు రోజుల విచారణ తర్వాత బాబాను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఆరోగ్యం సరిగా లేదంటూ ఇటీవల ఫలహార బాబా అల్వార్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు.

ఫలహార మహారాజ్
కౌశలేంద్ర ప్రసన్నాచార్య ఫలహార మహారాజ్ (70) రాజస్థాన్‌లో ఫేమస్ బాబా. ఆహారంగా కేవలం పండ్లు తీసుకుంటాడని, ఆయనకు ఆ పేరు వచ్చింది. ఫలహార బాబా ఆగస్టు ఏడోతేదీ రాత్రి గదికి పిలిపించుకుని తనపై లైంగికదాడికి పాల్పడినట్లు ఆశ్రమంలోని ఓ మహిళ (21) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు బాబాను అరెస్టు చేసేందుకు ఆశ్రమానికి వెళ్లగా.. ఆయన హైబీపీతో బాధపడుతూ దవాఖానలో చేరినట్టు సిబ్బంది తెలిపారు.

దవాఖానలో చికిత్స పొందుతున్న బాబా ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని ఆయన కోలుకున్న తర్వాత విచారణ జరుపుతామని పోలీసులు చెప్పారు. బాబా సిఫారసుతో ఢిల్లీలోని ఓ సీనియర్ లాయర్ వద్ద జూనియర్‌గా చేరిన ఆ మహిళ విరాళం ఇచ్చేందుకు ఆశ్రమానికి వచ్చినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. ఫలహార బాబాకు దేశ, విదేశాల్లోనూ భక్తులున్నారు. ఆయన ఆశీర్వాదం కోసం ప్రముఖులు సైతం బారులు తీరుతారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy