భద్రాచలంలో వజ్ర మినీ ఏసీ బస్సులు

VAJRA_BUSESపవిత్ర పుణ్యక్షేత్రం కలిగిన భద్రాచలంలో  ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని భద్రాచలం ఆర్టీటీ డిపో వజ్ర మినీఏసీ బస్సులను ఏర్పాటు చేసింది. నాలుగు కొత్త బస్సు సర్వీసులను వినియోగంలోకి తీసుకొచ్చారు. టెంపుల్ సిటీ టూ టెంపుల్ సిటీ (భద్రాచలం – విజయవాడ)వరకు ఈ బస్సులు తిరుగుతాయి. ఉదయం 5గంటల నుంచి ఈ బస్సు సర్వీస్‌లు ప్రారంభం అవుతాయి. భద్రాచలం బస్‌స్టేషన్( రామాలయం) నుంచి విజయవాడ ఆటోనగర్ వరకు 355 రూపాయలు టిక్కెట్ ధరగా నిర్ణయించారు. ఈ బస్సుల యందు ఒక మొబైల్ టాబ్‌ను బిగించారు. ఇది జీపీఎస్‌తో అనుసంధానం గావించబడి ఉండడంతో ఈ బస్సులో టిక్కెట్లు రిజర్వ్‌చేసుకున్న ప్రయాణికులను, ఆ బస్సు కదలికలను తెలుసుకోవచ్చు. ఈ మినీ బస్సులో 18 సీట్లు ఉంటాయి. మొబైల్ ఫోన్ చార్జింగ్, ఎయిర్ సస్పెంక్షన్, ఎల్సీడీ టీవీ వ్యక్తిగత ఏసీ నియంత్రణ సౌకర్యం ఏర్పాటు చేశారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy