భద్రాద్రిలో శ్రీరామ రక్ష, ప్రకాశోత్సవ పూజలు

bhadradriభద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మరో రెండు కొత్త పూజలను నిర్వహించనున్నారు. ఈ పుణ్యక్షేత్రంలో త్వరలో నిర్వహించతలపెట్టిన ఈ ప్రత్యేక పూజలు భక్తులను ఆధ్యాత్మిక పారవశ్యంలో ముంచెత్తనున్నాయి. శ్రీరామ రక్ష, ప్రకాశోత్సవం అనే రెండు పూజలు ఎప్పటి నుంచి నిర్వహిస్తారో నిర్వాహకులు ప్రకటించలేదు. కానీ ఈ పూజల కోసం కొందరు భక్తులు ఎప్పుడెప్పుడాంటూ ఎదురుచూస్తున్నారు.

శ్రీరామ రక్షా పూజ: ప్రతి బుధవారం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు శ్రీరామ రక్ష పూజ నిర్వహించాలని యోచిస్తున్నారు నిర్వాహకులు. ఈ పూజలో పసుపు, కుంకుమ, కాషాయ రంగు తాడుకు కట్టిన రూపు, కంకణానికి పసుపు తాడు, నివేదనకు రసహోర సమర్పించనున్నారు. ప్రత్యేక పూజలు చేసిన రూపు, పసుపు తాడును భక్తులకు అందజేస్తారు. దీనికి టిక్కెట్ ధర ఇంకా నిర్ణయించలేదు.

ప్రకాశోత్సవం పూజ: ప్రకాశోత్సవాన్నే ప్రదోష హారతి అంటారు. ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 6.30 గంటల వరకు ఈ హారతులు ఇస్తారు. ఆర్జిత పద్ధతిలో జరుగనున్న ఈ పూజకు టికెట్ ధరను నిర్ణయించాల్సి ఉంది. ఇప్పటికే నిర్వహిస్తున్న శనివారం బంగారు తులిసి పూజ, ఆదివారం బంగారు పుష్పార్చనలకు 500 రూపాయల టికెట్ ఉంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy