భద్రాద్రి ఆలయ తుది నమూనా ఇదే

bhadrachalam-temple-new-planభద్రాద్రి ఆలయ తుది నమూనా సిద్ధమైంది. ఆలయాన్ని యాదాద్రి దేవాలయం తరహాలో అభివృద్ధి చేయాలన్న సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు ఆర్కిటెక్‌ ఆనంద్‌ సాయి ఆలయ అభివృద్ధి తుది నమూనాను తయారు చేశారు. వాటిలో ఆగమశాస్త్రం ప్రకారం లేని వాటిని, ఇతరత్రా మార్పులు, చేర్పులను ఆలయ వేద పండితుల సూచనలతోనే ఆర్కిటెక్‌ తుది నమూనాను రూపొందించారు.  తుదిదశలో ఖరారైన నమూనాను మంగళవారం రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భద్రాద్రి ఆలయ కార్యనిర్వాహక అధికారి శ్రీనివాస్‌, వేద పండితులు చినజీయర్‌ స్వామికి చూపించారు. ఈ సందర్భంగా తుమ్మల నమూనాను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నమూనాలో ఉన్న మూడు ప్రాంగణాల్లో మొదటి ప్రాంగణాన్ని రాతి కట్టడంతో నిర్మించాలని, రెండు, మూడు ప్రాంగణ నిర్మాణాలకు ఇటుకలను వినియోగించవచ్చని సూచించారు చినజీయర్‌ స్వామి. తుది నమూనా అద్భుతంగా ఉందంటూ దానిపై తన సందేశం రాసి సంతకం చేశారు ఆయన. యాదాద్రి తరహాలో భద్రాద్రిని దేవాలయ నగరంగా మార్చాలన్న సీఎం ఆదేశాల మేరకు శరవేగంగా భద్రాద్రి బృహత్‌ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు మంత్రి తుమ్మల.. తుది నమూనా ఖారురు కాగానే చినజీయర్‌ స్వామి సలహా తీసుకోవాలన్న సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు మంగళవారం స్వామిని కలిశామని, స్వామి సంతృప్తి వ్యక్తం చేయడం సంతోషకరమని అన్నారు. దేవాలయ పునర్‌నిర్మాణం ఆగమశాస్త్రం ప్రకారం చేస్తుండటంతో మాఢ వీధుల నిర్మాణంలో కొందరు ఇళ్లు కోల్పోతున్నారని, వారికి మెరుగైన పరిహారం ఇవ్వాలని ఆలయ ఈవోను ఆదేశించామన్నారు తుమ్మల. తుది నమూనాను ముఖ్యమంత్రికి పంపాలని ఆర్కిటెక్‌, అధికారులకు సూచించామన్నారు ఆయన. సీఎం ఆమోదం తర్వాత టెండర్లు ఖరారు చేసి, ఆలయ అభివృద్ధి పనులకు ఈ నెలలోనే శంకుస్థాపన చేస్తామన్నారు తుమ్మల నాగేశ్వర్ రావు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy