భద్రాద్రి బాగూ చూడండి సారూ!

templeభద్రాచలం.. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన ప్రాంతం. ఎన్నో వందల ఏళ్ల చరిత్ర ఉన్న భద్రాద్రి అభివృద్ధికి దూరమౌతుందన్న వాదనలున్నాయి. రాష్ట్ర విభజన టైంలో ఈ ప్రాంతం తమదంటూ ఏపీ కయ్యానికి దిగింది. ఆ తర్వాత విభజనలో భద్రాచలం డివిజన్ లోని చాలా ప్రాంతాలు ఏపీలోకి వెళ్లాయి. దీంతో భద్రాచలం అభివృద్ధి  ఆగిపోయిందంటున్నారు స్థానికులు.

భద్రాచలం… రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో ఒకటి. ఉమ్మడి రాష్ట్రంలో భక్తులతో కళకళలాడిన భద్రాద్రి.. స్వరాష్ట్రంలో అనుకున్నంత అభివృద్ధి జరగలేదంటున్నారు స్థానికులు. అటు ప్రభుత్వం దీనికి ప్రత్యేక నిధులు కేటాయిస్తే టెంపుల్ సిటీగా డెవలప్ అవుతుందంటున్నారు. అభివృద్ధితో పాటు.. యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని చెబుతున్నారు. ప్రభుత్వం భద్రాదిపై స్పెషల్ చేస్తే పర్యాటకంగానూ డెవలప్ అవుతుంది.

విభజనతో చీలిన భద్రాచలాన్ని జిల్లా కేంద్రంగా మార్చితే పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడం ఖాయం. యాద్రాద్రి తరహాలోనే భద్రాచలం రాములోరి ఆలయానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతున్నారు ప్రజలు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy