భయపెట్టిన పులి – బెదిరిన సింహం

tiger - lionసింహంతో వేట.. పులితో ఆట మంచిది కాదంటారు. వాటిని చూడటం ఎవరికైనా థ్రిల్లే. అదీ దూరం నుంచి. కానీ ఆ వైల్డ్ యానిమల్స్ దగ్గరకొస్తే ? గుండెలు జారిపోవాల్సిందే. వేర్వేరు ఘటనల్లో ఈ రెండు జంతువులు జనారణ్యంలోకొచ్చి భయపెట్టాయి. వాటి సంగతేంటో చూడండి.

సఫారీ సింహాన్ని… బెంగాల్ టైగర్ ని చూడాలంటే ఎన్ని ఘట్స్ ఉండాలి. మామూలుగా వాటిని జూలోనో… డిస్కవరీ ఛానెళ్లోనో.. లేదంటే నేషనల్ జాగ్రఫీ ఛానెళ్లోనో చూడగలం. కానీ అవి జనారణ్యంలోకొస్తే.. తట్టుకోవడం మనవల్ల కాదు. పులిని లైవ్ లో చూడటం ఎవరికైనా సరదాగానే ఉంటుంది. అదే పులి మన కళ్ల ముందుకొస్తే.. చెమటలు పట్టేస్తాయి.  మహారాష్ట్ర నాగపూర్ ఉమ్రేద్ కర్హండ్లా వైల్డ్ లైఫ్ శాంక్చూరీలో ఇలాంటి సీనే కనిపించింది.

 

tigerసపారీ టూర్ కు ఓ జీపులో బయలుదేరారు కొంత మంది. పులిని చూడాలన్న ఇంట్రెస్ట్ తో.. జీప్ స్టార్ట్ చేశారు. కొంత దూరం  వెళ్లారో లేదో…సీన్ సితారైంది. పులిని దూరం నుంచి చూసి ఎంజాయ్ చేద్దామనుకుంటే.. ఏకంగా కళ్లముందుకొచ్చింది. దాంతో ఫీజులు ఎగిరిపోయాయి అందరికీ. పులి… జీపు దగ్గరకొచ్చి… అద్దాల్ని కొరకడం.. డోర్ లాగడం చూసి… వణుకుడు జ్వరం పట్టుకుంది వాళ్లకు. పాపం ఏమనుకుందో ఏమో… వచ్చిన దారిలోనే వెళ్లిపోయింది పులి. దాంతో ఊపిరిపీల్చుకున్నారంతా.

 

 

lion -252

ఇక గుజరాత్ లో సింహం రోడ్ల మీదకొచ్చింది. సింహం అడవికి రారాజే కావొచ్చు. కానీ అది రోడ్డు మీదకొస్తే ? దాన్ని చూసేందుకు వందలాది మంది జనం పోగైతే ? ఆ క్రూర జంతువైనా భయంతో వణికిపోవాల్సిందే. వెస్ట్రన్ గుజరాత్ లోని అమ్రేలి జిల్లా ఇలాంటి సీనే కనిపించింది. గిర్ అడవీ ప్రాంతం నుంచి ఓ సింహం దారితప్పి జనారణ్యంలోకొచ్చింది. దాన్ని చూసేందుకు భారీగా జనం పోగయ్యారు. దాంతో భయపడిన సింహం… జఫ్రాబాద్ పోర్ట్ ఏరియాకు పారిపోయింది. ఓ వైపు సముద్రపు అలలు భయపెడుతుంటే.. మరోవైపు జనం దాన్ని చూసేందుకు పోటీపడుతుంటే… ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపింది సింహం. చివరికి టెన్షన్ తట్టుకోలేక సముద్రంలోకి దూకేసింది.  అటవీ శాఖ సిబ్బంది దాన్ని ఎలాగోలా కాపాడారు. నీళ్లలోంచి బయటకు తీసుకొచ్చి.. మత్తు మందిచ్చి యానిమల్ రెస్క్యూ సెంటర్ కు తరలించారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy