భరత్ అనే నేను మూవీ : లవర్ తో రోడ్డుపై నడుస్తున్న సీఎం

bharath-ane-nenuభరత్ అనే నేను అంటూ వస్తున్న ప్రిన్స్ మహేష్ బాబు కొత్త సినిమా కొత్త పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో ముఖ్యమంత్రిగా నటిస్తున్నాడు హీరో. ఇప్పటి వరకు ఎమోషన్, యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన పోస్టర్లు మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ టైం హీరోయిన్ తో కలిసి ఉన్న పోస్టర్ విడుదల చేసింది యూనిట్. ఇది చాలా డిఫరెంట్ గా ఉంది.

ఈ పోస్టర్ చూస్తుంటే.. హీరో మహేష్ బాబు సీఎం అయిన తర్వాత తన లవర్ తో రోడ్డుపై నడుస్తున్నట్లు ఉంది. ఆ వెనకే సీఎం సెక్యూరిటీ వెహికల్స్ వస్తూ ఉంటాయి. వీళ్లద్దరూ నడుస్తూ ఉండటంతో చుట్టూ పోలీసుల పహారా ఉంటుంది. లవర్ కోరికపై సరదాగా అలా రోడ్డుపై నడుస్తున్న సన్నివేశానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ పిక్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మహేష్ లుక్ కూడా అదిరింది. స్మార్ట్ గా ఉన్నాడు. ఈ సినిమాతోనే బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వాని తెలుగు తెరకి పరిచయం అవుతుంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy