భరత్ సాంగ్ : ఓ వయ్యారి వసుమతి

BHARAT ANE NENUకొరటాల శివ డైరెక్షన్ లో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా భరత్ అనే నేను. ఈ మూవీ ఏప్రిల్ 20న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం (ఏప్రిల్-10) ఓ వసుమతి అనే లిరికల్ సాంగ్ ను ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసింది యూనిట్. ఇప్పటే రిలీజైన ఆడియోకి మంచి రెస్పాన్స్ రాగా..లేటెస్ట్ సాంగ్ ప్రొమోలు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.

ఈ సాంగ్ ను హీరో మహేష్ బాబు ట్విట్టర్ పోస్ట్ చేసి, ఫ్యాన్స్ తో సంతోషాన్ని పంచుకున్నాడు. హోప్ యు ఎంజాయ్ దిస్ వన్ టు అని ట్విట్ చేశాడు మహేష్. మహేష్ కి శ్రీమంతుడు లాంటి హిట్ ఇచ్చిన కొరటాల ఈ సినిమాకి డైరెక్టర్ కావడంతో ఫ్యాన్స్ లో మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దేవీశ్రీ మ్యూజిక్ అందించిన ఈ మూవీలో మహేష్ సరసన కైరా అద్వాని హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.


Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy